నిరూపించండి! రాజీనామా చేస్తా, ఆ 17ని. ఏం చేశారు?: కోమటిరెడ్డి సవాల్
హైదరాబాద్: అసెంబ్లీలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి స్పందించారు. తాను విసిరిన హెడ్ ఫోన్ తాకి తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌కు గాయం అయినట్టు రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి సవాల్ విసిరారు.

రాజీనామా చేస్తా.. ఆ 17ని. ఏం చేశారు?
గాయమైనట్లు దృశ్యాల ద్వారా రుజువు చేస్తే బేషరతుగా క్షమాపణ చెప్పి తన రాజీనామా సమర్పిస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఘటన జరిగి 17 నిమిషాల తర్వాత వీల్‌ఛైర్‌లో కూర్చోబెట్టి గాయమైందని చెబుతున్నారని ఆరోపించారు.

స్పష్టత ఏదీ?
గవర్నర్ ప్రసంగంలో దేనిపైనా స్పష్టతలేదని కోమటిరెడ్డి మండిపడ్డారు. కేవలం 25 నిమిషాల్లోనే ప్రసంగాన్ని గవర్నర్ ముగించారని, రైతుల మద్దతు ధరపై ఏ నిర్ణయం తీసుకున్నారో తెలపలేదన్నారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజైన సోమవారం ఉదయం కాంగ్రెస్ సభ్యులు ఆందోళన దిగిన విషయం తెలిసిందే. కాగా, ఎమ్మెల్యే కోమటిరెడ్డి విసిరిన హెడ్ ఫోన్ తగిలి మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కంటికి తగలడంతో గాయమైంది. దీంతో ఆయనను సరోజినీ కంటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నిలదీస్తాం
కాగా, ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం నిరాశ కలిగించిందని టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు. ఏ అంశాలపైనా స్పష్టత ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఇలావుంటే.. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సభలో తమ శాసనసభాపక్షం నిలదీస్తుందని అన్నారు.

మాయ మాటలతో మోసం
టీడీపీ ఎమ్మల్యేలు సోమవారం ఉదయం ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులు ఆర్పించిన అనంతరం శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. కర్షకుల కడగండ్లు తీర్చలేని కేసీఆర్.. మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని రమణ ఆరోపించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ...శాసనసభ సమావేశాలను నడపాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు. ఎన్ని రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం గత సమావేశాల్లో బీఎసీ సమావేశం నిర్వహించకుండానే అర్థాం

15న బడ్జెట్.. 27వరకూ సమావేశాలు
కాగా, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 27వరకు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. 27వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడనున్నాయి. మార్చి 15వ తేదీన ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
శాసనసభలో జరిగిన ఆందోళన ఈ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై చర్చకు వచ్చినట్లు సమాచారం. దాడిపై కాంగ్రెస్ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా జరిగిన చర్యే గానీ.. ఉద్దేశపూర్వకంగా చేసినది కాదని వారు వివరణ ఇచ్చినట్లు సమాచారం.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications