హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆధారాలు కొట్టేశా, చర్య తీసుకునే దమ్ముందా: సర్కార్‌కు మర్రి సవాల్, ఈసీ ఆశ్చర్యం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సనత్ నగర్ నియోజకవర్గంలో 25వేల ఓట్లను తొలగించారని, వీటికి సంబంధించిన ఆధారాలను జిహెచ్ఎంసీ నుచి తానే తస్కరించానని, దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి శనివార ప్రభుత్వానికి సవాల్ చేశారు.

సోమేష్ కుమార్‌ను బదలీ చేయడం కాదని, సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓట్లు తొలగించి పౌరుల రాజ్యాంగపరమైన హక్కులను కాలరాసే అధికారం వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఓట్ల తొలగింపుకు కారణమైన సోమే‌‍ను పాతరేస్తామన్నారు. ఎన్నికల అధికారి భన్వర్ లాల్‌పైనా చర్యలు తీసుకోవాలన్నారు.

కాగా, ఓట్లను తొలగించే ఉద్దేశంతో, ఆ విషయాన్ని ఓటర్లకు ముందుగా తెలియజేసేందుకు అధికారులు నోటీసులను సిద్ధం చేశారు. కానీ, వాటిని మాత్రం ఎవరికీ ఇవ్వలేదు. ఇలాంటి 22 వేల నోటీసులను చూసి ఆశ్చర్యపోవడం కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు అధికారుల వంతయిందని సమాచారం.

ఓట్ల తొలగింపు

ఓట్ల తొలగింపు

ఓట్ల తొలగింపుపై శనివారమిక్కడ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో... కేంద్ర ఎన్నికల సంఘం విచారణ బృందం పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి సునీల్ గుప్త ఆధ్వర్యంలోని 14 మందితో కూడిన బృందం ఒక్కో పార్టీ ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమైంది.

 ఓట్ల తొలగింపు

ఓట్ల తొలగింపు

ఓటర్ల పేర్ల తొలగింపు తీరును తెరాస మినహా మిగతా అన్ని పార్టీలవారు తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. ఎలాంటి విచారణా లేకుండానే ఓటర్ల పేర్లను తొలగించినట్లు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌ తదితరులు ఆ బృందాన్ని కలిశారు.

ఓట్ల తొలగింపు

ఓట్ల తొలగింపు

ఓటర్ల తొలగింపునకు సంబంధించి జారీ చేసేందుకు సిద్ధంచేసిన వేలాది నోటీసుల కట్టలను తీసుకొచ్చి వారి ముందు పెట్టారు. వీటిని ఓటర్లకు జారీ చేయలేదని, ఇవన్నీ మున్సిపల్‌ వార్డు కార్యాలయాల్లో ఉండగా తెప్పించామని వివరించారు.

ఓట్ల తొలగింపు

ఓట్ల తొలగింపు

వాటిల్లో కొన్నింటిని సభ్యులు పరిశీలించి... ఎందుకు జారీ చేయలేదని, నోటీసుల్లోని వారందిరి పేర్లనూ తొలగించారా? అని అధికారులను ప్రశ్నించారు. నోటీసుల కట్టల ఫొటోలను విచారణ బృందం తీసుకుంది. అత్యధికంగా సుమారు గంటన్నరపాటు కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు వివిధ అంశాలను బృందం దృష్టికి తెచ్చారు.

ఓట్ల తొలగింపు

ఓట్ల తొలగింపు

ఓట్ల తొలగింపుపై గతంలోని తాము ఇచ్చిన ఫిర్యాదుల నకళ్లను టిడిపి ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కెపి వివేక్, అరికిపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్‌, పార్టీ ప్రతినిధి కూన వెంకటేశం గౌడ్‌ తదితరులు సమర్పించారు.

ఓట్ల తొలగింపు

ఓట్ల తొలగింపు

టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రొఫెసర్‌ శ్రీనివాస రెడ్డి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో తొలగించిన ఓటర్ల వివరాలను అందించారు.

ఓట్ల తొలగింపు

ఓట్ల తొలగింపు

బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ ఇంద్రసేనా రెడ్డి, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, మజ్లిస్‌ ఎమ్మెల్సీ జాఫ్రీ, సీపీఐ, సీపీఎంల నుంచి డీజీ నర్సింహా, రాంనరసింహారావు తదితరులు ఓట్ల తొలగింపుపై తమ వాదనలను వినిపించారు.

English summary
Congress leader Marri Shashidhar Reddy said that he will see that Somesh Kumar is booked and suspended for deleting voter names.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X