Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'ఓడిపోతే ఎలా తిరుగుతా, ఆయనకు అంత సీన్‌లేదు'

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గంలో గెలవకపోతే రాష్ట్రంలో తిరగలేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు.కంచర్ల భూపాల్‌రెడ్డి టిఆర్ఎస్‌లో చేరడంతో నల్గొండ అసెంబ్లీ నియోజకర్గంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొట్టిపారేశారు.

రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ నేపథ్యంలో టిడిపి నుండి కంచర్ల భూపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కాకుండా టిఆర్ఎస్‌లో చేరారు. 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్ నుండి కంచర్ల భూపాల్‌రెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థిగా నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయనున్నారు.

కంచర్ల భూపాల్‌రెడ్డి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కంచర్ల భూపాల్‌రెడ్డిపైనే విజయం సాధించారు. అయితే రేవంత్‌రెడ్డి టిడిపిని వీడడంతో కంచర్ల సోదరులు టిఆర్ఎస్‌లో చేరారు. అసెంబ్లీ లాబీల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుదవారం నాడు మీడియాతో చిట్ చాట్ చేశారు.

 వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే రాష్ట్రంలో తిరగలేను

వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే రాష్ట్రంలో తిరగలేను

2019 ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఎంపీగా పోటీ చేసే ఆలోచన తనకు లేదన్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తాను ఓటమిపాలైతే రాష్ట్రంలో ఎలా తిరుగుతానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.నల్గొండ నియోజకవర్గంలో తనకు తిరుగులేదనే అభిప్రాయాన్ని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యక్తం చేశారు.

కంచర్ల భూపాల్‌రెడ్డికి అంత సీన్‌లేదు

కంచర్ల భూపాల్‌రెడ్డికి అంత సీన్‌లేదు

2019 ఎన్నికల్లో కంచర్ల భూపాల్‌రెడ్డి నల్గొండ నుండి విజయం సాధించే సీన్‌లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎందరు వచ్చినా తన విజయాన్ని ఆపేవారే లేరని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. పార్టీ మారినంత మాత్రాన విజయం సాధించే అవకాశం ఉంటుందా అని వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

 ఎల్బీ స్టేడియంలో సభ

ఎల్బీ స్టేడియంలో సభ

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థులకు అండగా ఉంటామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హమీ ఇచ్చారు. టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌ను అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. విద్యార్తులను అండగా ఉన్నామనే భరోసాను కల్పించేందుకు గాను త్వరలో ఎల్బీ స్టేడియంలో విద్యార్థులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు.

కాంగ్రెస్‌ పార్టీదే విజయం

కాంగ్రెస్‌ పార్టీదే విజయం

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ ఇచ్చిన హమీలను అమలు చేయడం లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. టిఆర్ఎస్‌లో ఎందరు చేరినా ప్రయోజనం ఉండబోదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.నల్గొండ జిల్లాలో అనారోగ్యం బారిన పడిన అనాథ శిశువులను హైదరాబాద్‌కు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+