పవన్ కు లెటర్ రాశా, తెలంగాణ పునర్నిర్మాణానికి పార్టీ అవసరం: గద్దర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:సినీ సటుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేస్తానని ప్రజా యుద్దనౌక గద్దర్ స్పష్టం చేశారు. ఈ మేరకు పవన్ స్పందన కోసం ఎదురుచూస్తున్నట్టు ఆయన చెప్పారు.

సినీ నటుడు పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేసే విషయమై ఆయన స్పష్టత ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీ పుట్టినట్టుగానే, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూడ మరో పార్టీ ఏర్పాటు అవసరమన్నారు గద్దర్.

gaddar

పవన్ కూడ సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ అంటున్నాడు, సౌత్ ఇండియా అంటే కేరళ, కొంకిణి, పలు రాష్ట్రాలు , వివిధ భాషలు, దాని గురించి తమ్ముడికి ఓ లెటర్ రాసిచ్చాను. ఉత్తరంపై తన స్పందన కోసం ఎదురుచూస్తున్నా అంటూ గద్దర్ చెప్పారు.

తెలంగాణలో టిఆర్ఎస్ కు వ్యతిరేకశక్తులను కూడగట్టే ప్రయత్నం సాగుతో్ంది.ఇందులో భాగంగానే గద్దర్ తెరమీదికి వచ్చారు.రానున్న రోజుల్లో రాజకీయాల్లో కీలకమైన మార్పులు చోటుచేసుకొనే అవకాశాలున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
iam waiting for pavan said Gaddar,he already wrote a letter to pavankalyan for together working on peoples problem.
Please Wait while comments are loading...