సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కాటా కలిశారు. ఇటీవల కేంద్ర సర్వీసులో ఆమ్రపాలి డిప్యూటేషన్ పూర్తి కావడంతో రాష్ట్ర సర్వీసులో చేరనున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె రిపోర్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఆమ్రపాలి రాష్ట్ర విభజన తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. తన పని తీరుతో డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారామె. 2020లో ఆమ్రపాలికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో అక్కడే డిప్యూటీ కార్యదర్శిగా పనిచేశారు.

IAS officer Amrapali meets CM Revanth reddy to report her duty

అక్కడ డిప్యూటేషన్ పూర్తి కావడంతో ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వంలోకి వచ్చారు. ఈ మేరకు ఇక్కడ రిపోర్టు చేసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వంలో ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు.

2018లో తెలంగాణ ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా కూడా ఆమ్రపాలి పనిచేశారు. అంతకుముందు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గానూ ఆమె పనిచేశారు. తాను పనిచేసిన వివిధ హోదాల్లో ఆమె తన ముద్రను వేసి మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు.

IAS officer Amrapali meets CM Revanth reddy to report her duty

కాగా, 2018, ఫిబ్రవరిలో ఆమ్రపాలి వివాహం జరిగింది. ఆమ్రపాలి ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో వరంగల్ జిల్లా నుంచి పెళ్లికి హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు కొత్త దంపతులను ఆశీర్వదించారు. బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+