గోల్డెన్ టెంపుల్‌గా భాగ్యలక్ష్మీ ఆలయం..!!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయాన్ని 'గోల్డెన్ టెంపుల్' గా మారుస్తామని ఆయన ప్రకటన చేశారు. ఈరోజు బీజేపీ తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచిందంటే దానికి భాగ్యలక్ష్మీ అమ్మవారి దయ ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ విజయంలో కార్యకర్తల కష్టార్జితం మరువలేనిదన్నారు.

భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్
కార్యకర్తలతోపాటు బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలందరికీ ఇదే నా సెల్యూట్ అని చెప్పారు. నిన్న హైదరాబాద్ వచ్చిన బండి సంజయ్ కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు తదితరులతో కలిసి పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు.. మళ్ళీసారి ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారం ఖాయమన్నారు.

If bjp forms govt in telangana will make Bhagyalakshmi temple a golden temple Union Minister Bandi Sanjay

భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ చేస్తాం
భాగ్యలక్ష్మీ అమ్మవారు చాలా పవర్ ఫుల్. అమ్మవారి దయవల్లే ఆనాడు ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతమైందని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మీ ఆలయాన్ని 'గోల్డెన్ టెంపుల్' గా మారుస్తామన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రి మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతోపాటు జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్.

తెలంగాణాలో బీజేపీని తిరుగులేని శక్తిగా మారుస్తాం
సామాన్య కార్యకర్తలమైన మేం ఈ రోజు కేంద్ర మంత్రులుగా ఉన్నామంటే.. బీజేపీ వల్లే సాధ్యం అని, సామాన్యులకు పట్టం కట్టే పార్టీ బీజేపీ అన్నారు. కార్పొరేటర్ కేంద్ర మంత్రి కావొచ్చని, చాయ్ వాలా ప్రధాని కావొచ్చని.. నిరూపించిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన బీజేపీని తెలంగాణలో తిరుగులేని శక్తిగా మార్చి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేదాకా పోరాడతా. నా చివరి రక్తపు బొట్టు వరకు పార్టీ కోసమే ధారపోస్తా అని బండి సంజయ్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+