సీఎం కేసీఆర్ ను పీఎం గా ప్రజలు అంగీకరించరు :దత్తాత్రేయ
రానున్న ఎన్నికల్లో బీజేపీ 300 సీట్లు సాధిస్తే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు రాజకీయ సన్యాసం చేస్తారా అంటూ మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సవాల్ విసిరారు.
కాగా సీఎం కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ అనేది ఒక అతుకుల బొంతగా ఆయన అభివర్ణించారు. కాగా కేసీఆర్ ఎవరు ప్రధానిగా అంగీకరించరని పేర్కోన్నారు. కాగా ఆయన గ్రామ సర్పంచి రీతీలో మాట్లాడుతున్నారని అన్నారు. ఇందుకు భారత ప్రజలకు ఆయన క్షేమపణ తెలుపాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ ప్రధానిని అలా మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు.

ఇక తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 30 వేల కోట్లను గ్రాంట్ గా ఇచ్చిందని తెలిపారు. వాటిని లెక్కలతో సహ నిరుపించేందుకు తాము సిద్దమని అన్నారు. ఎమ్ఐఎమ్ మెప్పుకోసమే సీఎం కేసీఆర్ మోదీని విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications