భూకబ్జా వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. "కేసీఆర్ ఆదేశిస్తే రాజీనామానే!"
ఖమ్మం : కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ భూకబ్జా వివాదంలో ఇరుక్కున్నారు. ఎమ్మెల్యే అజయ్ కు చెందిన మమతా విద్యాసంస్థలు.. కాలేజీని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని.. ఆపై అజయ్ సిఫారసులతో దాన్ని క్రమబద్దీకరించుకుని ఆరోపిస్తూ.. ఖమ్మం జిల్లా మంచుకొండకు చెందిన మందడపు సుధాకర్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
కాగా, తాజాగా దీనిపై స్పందించిన కోర్టు.. ప్రస్తుతం ఆ భూమిలో చేపట్టిన మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ఆపేయాలని, మూడు వారాల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని హుకుం జారీ చేసింది. మరోవైపు అజయ్ వాదన మాత్రం మరోలా ఉంది. కోర్టు తీర్పు అనంతరం స్పందించిన ఆయన.. రూ. 2.10 కోట్లు చెల్లించి మమతా కాలేజీని ఆనుకుని ఉన్న స్థలాన్ని జీవో 59 ప్రకారం క్రమబద్దీకరించుకున్నామని తెలిపారు.

రాజకీయంగా ఎదుర్కోలేకనే కొంతమంది ఉద్దేశ్యపూర్వకంగా తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డ అజయ్.. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే తాను రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. తమ కాలేజీ ఉన్న ప్రాంతంలో ఎలాంటి చెరువులు లేవని, చెరువులను ఆక్రమించి క్రమబద్దీకరణ చేసుకున్నారన్న ఆరోపణల్లో వాస్తం లేదంటున్నారు అజయ్.
కేసీఆర్ రాచరిక పోకడలు : జీవన్ రెడ్డి
తెలంగాణ 'సీఎం కేసీఆర్ కు మంచి క్యాంపు కార్యాలయం కావాలి కానీ, పేదలకు మాత్రం ఇళ్లు వద్దా?' అని ప్రశ్నించారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కొత్త క్యాంపు కార్యాలయం నిర్మించాల్సిన అవసరం ఇప్పుడేమొచ్చిందంటూ మండిపడ్డ ఆయన.. కేసీఆర్ రాచరిక పోకడలు పోతున్నారని విమర్శించారు.
పేదల ఆరోగ్యం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లాంటి సంక్షేమ పథకాల గురించి పట్టించుకోకుండా.. సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వడం సమంజసం కాదన్నారు జీవన్ రెడ్డి. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను తక్షణం భర్తీ చేయాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications