PM Kisan: లింక్ క్లిక్ చేయగానే వాట్సాప్ హ్యాక్..
ఈ మధ్య సోషల్ మీడియా వాడకం భారీగా పెరుగుతోంది. సోషల్ మీడియా ఎంత ఉపయోగకరమో.. అంత ప్రమాదకరం కూడా. ఈ సోషల్ మీడియా ద్వారా చాలా మంది మోసపోతున్నారు. లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. హైదరాబాద్ చెందిన ఓ మహిళ ఇస్టా గ్రామ్ లో వచ్చిన మెసేజ్ చూసింది. యూట్యూబ్ వీడియోలకు లైక్ చేస్తే డబ్బులు ఇస్తామని ఆ మెసేజ్ సారంశం. అయితే ఆమె యూట్యూబ్ వీడియోలకు లైక్ లు కొట్టి డబ్బులు సంపాదించింది. కానీ తర్వాత సైబర్ నేరగాళ్ల ఆమెను ట్రాప్ లోకి లాగి లక్షలు కాజేశారు.
ఇలా గతంలో చాలా సంఘటనలు జరిగినా మోసాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా సైబర్ నేరగాళ్లు రైతులను టార్గెట్ చేశారు. వాట్సాప్ ల్లో లింక్ లు పంపుతూ ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. నిజామాబాద్ సిరికొండ మండలం సోంపెల్లి గ్రామంలో దాదాపుగా 10 మందికి పైగా వాట్సాప్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. గ్రామానికి చెందిన యువకులు తమ గ్రూపులో వచ్చిన పీఎం కిసాన్ యాప్ లింక్‌ను క్లిక్ చేశారు. కొద్ది సేపట్లోనే వారి వాట్సాప్ పూర్తిగా అవతలి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది.

యాప్ ఎంతకీ ఓపెన్ కావడం లేదు. ఆ యాప్‌ను ఇతరులు వాడుతున్నారని తెలిసింది. వివిధ గ్రూపులకు సందేశాలు ఫార్వర్డ్ చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ గ్రూపుల్లో ఏపీకే ఫైల్స్ ను పంపుతున్నారు. ఈ లింక్ పై క్లిక్ చేయగా.. వెంటనే వాట్సాప్ హ్యాక్ అయింది. దీంతో పీఎం కిసాన్ కు సంబంధించి ఎలాంటి లింక్ లను క్లిక్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు కోరుతున్నారు. ఏదైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని చెప్పారు.
పీఎం కిసాన్ కు సంబంధించి ఎలాంటి లింక్లు కానీ, మెసేజ్ లు కానీ రావని చెబుతున్నారు. ఏమైనా సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు.












Click it and Unblock the Notifications