ఆ ఊరికి సర్పంచ్ కావాలంటే.. కోతుల్ని పట్టాల్సిందేనా ?
వినడానికి విడ్డూరంగా ఉన్నా కూడా ఇది నిజం. ఆ ఊరికి సర్పంచ్ కావాలంటే గ్రామంలోని కోతులని పట్టుకోవాలని తేల్చి చెబుతున్నారు. దీంతో ఆ గ్రామంలో కోతుల బెడద పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారికి కొత్త తిప్పలు తెచ్చిపెట్టిందని అంటున్నారు. దాంతో ఊర్లో రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలు తీరుస్తాం అని కాకుండా.. కొత్తగా కోతులను వెళ్లగొడతాం.. మాకే ఓట్లెయ్కండి అంటూ ఆశావహులు ప్రచారానికి సిద్ధం అవుతున్నారంట. ఇంతకీ ఆ ఊరు ఏంటి.. ఈ కొత్త ప్రచారానికి కారణం ఏంటో తెలుసుకుందాం....
తెలంగాణలో మరికొద్ది నెలల్లోనే పంచాయతీ ఎన్నికలకు సైరన్ మోగనుంది. దీంతో ఆశావహులు అంతా ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇటీవల కాలంలో గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలో ఏ మూలన చూసినా కోతుల బెడద ఎక్కువైంది. రాష్ట్రంలో ఏకంగా 35 లక్షలకు పైగా కోతులు ఉన్నాయని.. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ కోతుల దాడుల్లో బాధితులుగా ఉంటున్నారు. కోతుల దాడిలో గాయపడటంతో పాటు గుంపుగా దాడి చేయడంతో ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలూ కూడా ఉన్నాయని వాపోతున్నారు.

పంట పొలాలను సైతం కోతులు ఇష్టానుసారంగా నాశనం చేసి రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నాయని వాపోతున్నారు. అందుకే ఈ క్రమంలోనే ఈసారి గ్రామాల్లో సర్పంచ్ గా ఎన్నికల్లో పోటీ చేసేవారు కోతుల సమస్యే ప్రధానంగా ప్రచారంలో దిగనున్నారు. ప్రజలు సైతం కోతుల బెడదను తీర్చేవారినే సర్పంచ్‌గా.. ఎంపీటీసీగా గెలిపిస్తామంటూ హామీ ఇస్తున్నారట. దాంతో సర్పంచ్‌గా పోటీ చేసే ఆశావహులు కూడా ఇప్పటి నుంచే కోతులను పట్టించే పనిలో బిజీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.
2019లో కూడా ఇదే తరహాలో..
2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కోతుల బెడద తీర్చినందుకు హనుమకొండ జిల్లాలో ఒకరిని సర్పంచ్‌గా గెలిపించారు. జిల్లాలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండకి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ దూడల సంపత్ భార్య సర్పంచ్ గా గెలిచారు. అందుకోసం ఆయన రోజుకో వేషం వేసుకుని కోతులను గ్రామం నుంచి తరిమేశాడట. అందరి సహకారంతో రూ.లక్ష వరకు విరాళాలు సేకరించి ఏపీ నుంచి మంకీ క్యాచర్‌లను పిలిపించి కోతులను అటవీ ప్రాంతంలో వదిలేలా చేశాడట. దాంతో ఆ ఎన్నికల్లో సంపత్ భార్య ప్రమీలను గ్రామస్తులు సర్పంచ్‌గా గెలిపించినట్టు చెబుతున్నారు.
కోతులకు ఫ్యామిలీ ప్లానింగ్
మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న కోతుల సంఖ్యని తగ్గించేందుకు అధికారులు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. కోతుల ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ కోసం 2020 డిసెంబర్‌లో నిర్మల్‌లో అటవీశాఖ ఆధ్వర్యంలో మంకీ రెస్క్యూ, రిహాబిటేషన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కోతులను పట్టుకొని అక్కడికి తీసుకొస్తే వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తారని తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications