లైంగిక వేధింపుల కేసులో ప్రొఫెసర్‌కు జైలు: చిట్టీల మాధవి పరారీ
హైదరాబాద్: పిహెచ్‌డి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇఫ్లూ ప్రొఫెసర్‌కు కోర్టు జైలు శిక్ష విధించింది. హైదరాబాదులోని ఇఫ్లూలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మహంతి పిహెచ్‌డి విద్యార్థినిపై లైంగిక వైధింపులకు పాల్పడినట్లు నాంపల్లి మహిళా కోర్టు నిర్ధారించింది. ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
ఇదిలావుంటే, హైదరాబాదులోని మదీనాగూడలో చిట్టీల పేరుతో రూ.12 కోట్లకు పైగా డబ్బు వసూలు చేసి మోసానికి పాల్పడిన మాధవి, వెంకటేశ్వర్లు దంపతులు ఉడాయించారు. వారిని అరెస్ట్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం వారంటున్నారు.

రూ. 10 రూపాయల చొప్పున వడ్డీ ఇస్తామని తమకు ఆశపెట్టారని బాధితులు చెబుతున్నారు. మాధవి, వెంకటేశఅవర్లు ఐదేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. మియాపూర్, చందానగర్ తదితర ప్రాంతాలకు చెందినవారు వీరి వద్ద పెద్ద యెత్తున చిట్టీలు వేసి మోసపోయారు.
ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం శ్రీరాంపూర్ ఆర్‌కే 7 గనిలో ప్రమాదం జరిగింది. మ్యాన్ రైడింగ్‌పై నుంచి కిందపడి కార్మికుడు మృతి చెందాడు. మృతుడి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కార్మికులు సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications