అక్రమ సంబంధం మాయలో..: ప్రియుడితో కలిసి భర్తనే కడతేర్చిన భార్య
బూర్గంపాడు: వివాహేతర సంబంధాలు పచ్చటి కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. ప్రియుడు లేదా ప్రియురాళ్ల కోసం కట్టుకున్నవాళ్లనే కడతేర్చుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. రాజకీయ నాయకుడైన తన భర్తను ఓ భార్య ప్రియుడితో కలిసి హత్య చేసింది.
Recommended Video


కొండలరావు-ముక్తేశ్వరి:
కొండలరావు(35)-ముక్తేశ్వరి దంపతులు భద్రాచలం పట్టణంలో నివసిస్తున్నారు. వీరికి సంధ్యారాణి అనే కుమార్తె కూడా ఉంది. కొండలరావు స్థానిక సీపీఎం పట్టణ కార్యాలయ బాధ్యుడిగా, రజక సంఘం జిల్లా నాయకుడిగా ఉన్నాడు.

వివాహేతర సంబంధం:
కొండలరావు భార్య ముక్తేశ్వరికి కొన్నాళ్ల క్రితం నాని అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే కొండలరావు అడ్డు తొలగించుకుంటే.. తమ బంధానికి అడ్డు ఉండదని ఇద్దరూ భావించారు. అనుకోవడమే ఆలస్యం హత్యకు పథకం పన్నారు.

ప్రియుడితో కలిసి హత్య:
బుధవారం అర్థరాత్రి సమయంలో కొండలరావు భార్య ముక్తేశ్వరి ప్రియుడిని ఇంటికి పిలిపించింది. ప్రియుడు నాని స్నేహితుడు శివతో కలిసి అక్కడికి వచ్చాడు. ఆపై ముగ్గురు కలిసి కొండలరావును హత్య చేశారు. అయితే హత్య సమయంలో ముక్తేశ్వరి అక్క కొడుకు రుద్రబోయిన గోపీ కూడా అక్కడే ఉన్నాడు. హత్య విషయం బయట చెబితే చంపేస్తామని అతన్ని బెదిరించారు.

గోదావరి ఒడ్డున పూడ్చేశారు..:
భర్తను హత్య చేశాక నాని, శివ, గోపీ, కుమార్తె సంధ్యారాణిలతో కలిసి శవాన్ని ఆటోలో మరో చోటుకు తరలించింది ముక్తేశ్వరి. భద్రాచలం నుంచి బూర్గంపాడు మండలంలోని పాతగొమ్మూరు ఇసుకరేవు వద్దకు తీసుకెళ్లి.. అక్కడే గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. ఆ తర్వాత ఆటోలో పరారయ్యారు.

ఇలా వెలుగులోకి:
గురువారం ఉదయం తమ ఇంటికి వెళ్లిన గోపీ.. జరిగినదంతా ఇంట్లోవాళ్లకు చెప్పాడు. కుటుంబ సభ్యులు సీపీఎం నాయకులకు సమాచారం అందించడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొండలరావు సోదరి కొక్కిరేణి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు












Click it and Unblock the Notifications