గుడ్ న్యూస్: రేపటి నుంచి వర్షాలు లేవు
మూడు రోజుల క్రితం వరకు తెలంగాణలో వర్షాలు కురిసి వాతావరణం చల్లబడింది. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితిని బట్టి చూస్తే వర్షాలు ముగిసిపోయినట్లేనని, ఎండలు భారీగా పెరిగిపోయే ప్రమాదం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ఉగ్ర రూపానికి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలో 40 నుంచి 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలకు తోడు తీవ్ర వడగాడ్పలు వీస్తున్నాయి.
ఉదయం నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నానికి రోడ్లన్నీ బోసిపోతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి ఎండ తీవ్రత పెరుగుతోంది. ఏదైనా పని ఉంటే ఉదయాన్నే పూర్తిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు మధ్యాహ్నం వేళ పని ఉంటేనే బయటకు వెళ్లాలని, గొడుగు ధరించి వెళ్లాలని సూచిస్తున్నారు.మూడు రోజుల క్రితం వరకు తెలంగాణలో వర్షాలు కురిసినప్పటికీ ఇకనుంచి వర్షాలు కష్టమే అంటున్నారు. ఎండలు కూడా భారీగా పెరగనున్నాయి. మే నెల ప్రారంభం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఎండలు అగ్నిబాణాలు కురిపిస్తాయని చెబుతున్నారు.

గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది. వారం తర్వాత ఎండలు ముదురుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. మే నెల ప్రారంభం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఎండలు ముదిరిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. బయటకు వెళ్లాల్సినవారు తలపై టోపీ లేదంటే గొడుగు పెట్టుకోవాలి. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు తాగడంతోపాటు మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగుతుండాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications