Weather Report: మండిపోతున్న ఎండలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అయితే ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత వారంలో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున ఐఎండీ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.
ఇప్పటి వరకు ఆదిలాబాద్‌లో అత్యధికంగా 42.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. జగిత్యాల జిల్లాలో 41.5, మంచిర్యాల జిల్లాలో 41, కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో 40.5, నల్గొండ జిల్లాలో 40.5, ఆదిలాబాద్ జిల్లాలో 40.3, యాదాద్రి భువనగిరి జిల్లాలో 40.3, ములుగు జిల్లాలో 40.3, నాగర్‌కర్నూల్ జిల్లాలో 40.3 ఉష్ణోగ్రత నమోదైయ్యాయి. హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌లో అత్యధికంగా 37.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ సాధారణ వర్షపాతం నమోదవుతుందని IMD అంచనా వేసింది.

ఎల్ నినో రుతుపవనాల బలహీనత, పొడి వాతావరణం ఉంటందని అంచనా వేసింది. ఈ సంవత్సరం ఎల్ నినో పరిస్థితులు వచ్చే అవకాశం ఉండగా.. గత మూడు సంవత్సరాలు లా నినా వచ్చింది. భారతదేశ వ్యవసాయానిరి వర్షపాతం కీలకం. ఈ సమ్మర్ లో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తుంది. ఒక అత్యవస పరిస్థితుల్లో బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలను ఎండలో ఆడనివ్వకుండా చూడాలన్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

సింగరేణి ఏరియాలో ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. అందుకే కోల్ బెల్ట్ ఏరియాలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. గతంలో సింగరేణి ప్రాంతంలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications