మరో ముప్పు, ఇక మూడు రోజులు కుండపోత - ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్..!!

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో భిన్నంగా మారుతున్నాయి. ఉపరితల ఆవర్తనం కారణం గా ఉదయం వేళ ఎండ.. ఆకస్మికంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కుండపోత వాన తో జనం ఇబ్బందులు పడుతున్నారు. కాగా, రానున్న మూడు రోజులు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో, అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల పై అలర్ట్ జారీ అయింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఆది, సోమవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్​, నిజామాబాద్​తో పాటు రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్​, మహబూబ్​నగర్​, మహబూబాబాద్​ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్​, నిజామాబాద్​, మెదక్​, మహబూబ్​నగర్​, రంగారెడ్డి, హైదరాబాద్​, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.

imd-predicts-heavy-rains-in-next-three-days-in-telangana-districts-yellow-alert-issued

కొన్ని రోజులుగా హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారిగా కారుమబ్బులు చుట్టుముట్టి ఆకస్మికంగా కుండపోత వానలు కురుస్తున్నాయి. రహదారులు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీరు చేరుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఆదివారం దురదృష్టవశాత్తు ముగ్గురు వ్యక్తులు డ్రైనేజీల్లో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వివరించింది. హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్​ ప్రాంతంలోని పలు కాలనీలు రెండు రోజులుగా ముంపులోనే ఉన్నాయి. అశోక్​నగర్​, గాంధీనగర్​, హిమాయత్​నగర్​లోనూ కొన్ని అపార్టుమెంట్ల సెల్లార్లు చిన్న వర్షానికి ముంపునకు గురవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+