ఎయిర్ షో అదుర్స్: స్మార్ట్‌లుక్‌లో రేవంత్!
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించిన ఎయిర్ షో ఆకట్టుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎయిర్ షోను ప్రారంభించారు. సీఎంతోపాటు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఎయిర్ షోను వీక్షించారు.
15 సర్య కిరణ్ విమానాలతో చేసిన విన్యాసాలు సందర్శకులకను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎయిర్ షోను తిలకించేందుకు భారీ ఎత్తున నగరవాసులు ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకున్నారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి నల్ల కళ్లజోడు పెట్టుకుని.. గోధుమ రంగు టీ షర్టులో స్మార్‌లుక్‌లో ఈ కార్యక్రమంలో దర్శనమిచ్చారు.

మరోవైపు, ఎయిర్ షోకు సినీ హీరోయిన్లు మీనాక్షి చౌదరి, అంజలితోపాటు మరికొందరు సినీనటులు హాజరయ్యారు. ఇక, హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో హ్యాండీక్రాఫ్ట్స్, పుడ్ స్టాళ్లు ఏర్పాటు చేశారు. కాగా, ఐమ్యాక్స్ గ్రౌండ్స్‌లో గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ కాన్సర్ట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఎంజాయ్ చేశారు.
Live: Hon'ble CM Sri.A.Revanth Reddy participates in the Celebrations of Praja Palana Vijayotsavalu-Air Show https://t.co/JQHVYcXqnI
— Revanth Reddy (@revanth_anumula) December 8, 2024
కాగా, ఈ కార్యక్రమాలకు భారీ స్పందన వస్తుందని ముందే అంచనా వేసిన అధికారులు పెద్ద త్తున ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్ల పరిశీలన
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణ ప్రధాన ముఖద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు జరుగుతున్న ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితోపాటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications