రూ.2 లక్షల వరకు పంటరుణాన్ని ఒకేసారి మాఫీ చేస్తాం: ఉత్తమ్
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని పీసీసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
తాండూరు: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని పీసీసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ళలో ప్రస్తుతం నిర్మిస్తున్న గదికి అదనంగా మరో గదిని నిర్మించి ఇస్తామని ఆయన ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కెసీఆర్ కుటుంబానికి పదవులు ఎక్కడివని ఆయన ప్రశ్నించారు.
రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు.ఎస్సీ, బిసి, ఎస్టీలకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని ఉత్తమ్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications