Dalit Bandhu: దళిత బంధు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసిన బీఆర్ఎస్ నేత..!

దళిత బంధు పథకంతో బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చాలా చోట్ల బీఆర్ఎస్ కింది స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు దళిత బంధు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని ఓ బీఆర్ఎస్ నేత దళిత బంధు ఇప్పిస్తామంటూ మండలంలోని చాలా మంది వద్ద లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. బాండ్ పేపర్ కూడా రాసిచ్చాడు. దీంతో డబ్బులు ఇచ్చిన వారికి నమ్మకం కుదిరింది. సదరు బీఆర్ఎస్ లీడర్ బాండ్ పేపర్ లో అడ్వాన్సుగా రూ.1 లక్ష చెల్లించినట్లు.. మిగతా డబ్బులు పథకం వచ్చిన తర్వాత ఇవ్వాలని బాండ్ పేపర్ లో రాయించుకున్నాడు.

దళిత బంధు లిస్ట్ లో కొందరు డబ్బులిచ్చిన వారి పేరు రాకపోవడంతో వారు బీఆర్ఎస్ నేత వద్దకు వెళ్లారు. అతను రేపు ఇస్తా.. అంటూ నెలలు గడిపాడు. దీంతో బాధితుడు బీఆర్ఎస్ నేత కారును తీసుకెళ్లడంతో అస్సలు విషయం బయటకు వచ్చింది. కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భూక్యా దేవీలాల్ ​బీఆర్ఎస్ ​నియోజకవర్గ స్థాయి నాయకుడిగా చెప్పుకుంటూ ఉన్నాడు. దళితబంధు రెండో విడత ఇప్పిస్తామని చెప్పుకున్నాడు. చాలా మంది అతన్ని నమ్మారు. తమకు దళిత బంధు స్కీం ఇప్పించాలని ఒక్కొక్కరు రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలు చెల్లంచారు.

In Bhadradri Kothagudem districts, a BRS leader collected money saying that he would give a Dalit brother

వారికి బాండ్ పేపర్ రాసిచ్చాడు. ఒక వేళ దళిత బంధు పథం రాని వారికి ఇచ్చిన డబ్బులను వడ్డీ లేకుండా చెల్లిస్తానని బాండా పేపర్ లో సదర్ నేత పేర్కొన్నారు. కొంతమంది పేర్లు లిస్టులో రాకపోవడంతో దరఖాస్తు చేసుకున్న వారు అగ్రిమెంట్ ​ప్రకారం తమ డబ్బులు ఇవ్వాలని కొద్ది రోజులుగా దేవీలాల్ ​ను కోరుతున్నారు. దీనికి ఆయన ఎన్నికలు అయిపోయేంత వరకు ఆగాలన్నాడు. లేకుంటే మీ ఇష్టమున్నట్టు చేసుకొమ్మని తేల్చిచెప్పాడు. కొంత మంది బాధితులకు ఆగ్రహం రావడంతో దేవీలాల్ ​కారు తీసుకెళ్లారు. ఈ ప్రాంతంలో ఇలాగే స్కీంలు ఇప్పిస్తామని చెప్పి రూ.లక్షలు వసూలు చేసిన వారు మరో నలుగురి వరకు ఉన్నారని స్థానికంగా చెప్పుకుంటున్నారు.

దళిత బంధ పథకం ఇప్పిస్తామని చాలా మంది బీఆర్ఎస్ లీడర్లు డబ్బులు వసూలు చేసినట్లు గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యేలపై కూడా ఆరోపణలు రావడంతో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను మందలించారు. అయినప్పటికీ కొందరు నేతల తీరు మారడం లేదని తెలుస్తోంది. ప్రచారానికి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దళిత బంధు పథకం రావడం లేదని పలువురు నిలదీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+