డ్రంక్ అండ్ డ్రైవ్: పోలీసులకు చుక్కలు చూపించిన లేడీ ఫ్యాషన్ డిజైనర్
హైదరాబాద్: తాగి కారు నడుపుతూ తనిఖీల్లో ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన ఓ మహిళా ఫ్యాషన్ డిజైనర్ పోలీసులకు చుక్కలు చూపింది. వివరాల్లోకి వెళితే.. గత రాత్రి జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారతీయ విద్యాభవన్ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు.
ఈ క్రమంలో సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన మహిళా డిజైనర్ తాగి కారు నడుపుతూ అటుగా వచ్చింది. పోలీసులు శ్వాస విశ్లేషణ పరీక్ష(బ్రీత్ ఎనలైజ్)లు చేసేందుకు ప్రయత్నించగా ఆమె అందుకు నిరాకరించింది. పోలీసులను కాసేపు ముప్పుతిప్పలు పెట్టింది. చివరకు పోలీసులు ఆమెకు నచ్చజెప్పి శ్వాస పరీక్ష చేశారు.
ఈ పరీక్షలో మద్యం అతిగా తాగినట్లు గుర్తించడంతో కారును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. అతిగా మద్యం సేవించిన మరికొందరిని కూడా పోలీసులు పట్టుకున్నారు. వీరందరికి సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ఆలయంలో చోరీ
నల్గొండ జిల్లా బీబీ నగర్ మండలంలోని రామాలయంలో చోరీ జరిగింది. మండలంలోని బుట్టాయగూడెం గ్రామంలో ఉన్న రామాలయంలోకి శనివారం అర్ధరాత్రి చొరబడిన దుండగులు మూడు వెండి కిరీటాలు, ఓ బంగారు పుస్తెను ఎత్తుకెళ్లారు.
ఈ ఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగలెత్తుకెళ్లిన వస్తువుల విలువ రూ.లక్ష ఉంటుందని స్థానికులు తెలిపారు.












Click it and Unblock the Notifications