సింగరేణి స్టేడియంలో టోర్నడో : భయాందోళనకు గురైన స్థానికులు
గోదావరిఖని : టోర్నడోలు .. అంటే భారీ సుడిగాలులు. వీటి ధాటికి ఏమైనా కొట్టుకొనిపోవాల్సిందే. ఎక్కువగా అమెరికా, విదేశాల్లో చూస్తుంటాం. కానీ మనదేశంలో టోర్నడోలు చాలా అరుదు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో .. ఆ మధ్య కరీంనగర్ ఎల్ఎండీ డ్యాం వద్ద కూడా టోర్నడో రావడం కలకలం రేపింది. ఈ ఘటనలు మరచిపోకముందే గోదావరిఖని నడిబొడ్డున మరో టోర్నడో విరుచుకుపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

టోర్నడో బీభత్సం ..
మంగళవారం మధ్యాహ్నం .. ప్రచండ భానుడి భగ భగలతో జనం అల్లాడిపోతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కూడా వేడిగాలులు వీస్తున్నాయి. గాలుల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. సింగరేణి స్టేడియంలో నలుదిక్కులుగా వీచిన వడగాలులు ఒక్కసారిగా సుడిగాలిలా మారాయి. దీంతో సుడిగాలి టోర్నడోలా మారింది. 5 నిమిషాల పాటు టోర్నడో గాలి కొనసాగింది.
భయాందోళన
ఈ హఠాత్ పరిమాణంతో అక్కడున్న జనం ఆందోళనకు గురయ్యారు. నగరం నడిబొడ్డున టోర్నడో ఎంటని భయపడ్డారు. టోర్నడో చూసిన యువత తమ మొబైళ్లలో బంధించేందుకు పోటీపడ్డారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరలైంది. గోదావరిఖనిలో టోర్నడో బీభత్సమని చక్కర్లు కొడుతోంది.












Click it and Unblock the Notifications