ఓటేయమంటే ఈవీఎంతో ఫోటోలు : లైకుల కన్నా ముందే వచ్చిన పోలీసులు

హైదరాబాద్ : ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనే పిచ్చి పీక్‌కు చేరుతోంది. నలుగురు కలిస్తే క్లిక్ మనిపించాల్సిన ఫొటోలు .. భద్రత, గోప్యతను కూడా పెడచెవిన పెడుతున్నారు. తొలివిడత ఎన్నికలు ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఈవీఎం భద్రపరిచిన చోటుకి వెళ్లడమే గగనం, కానీ అక్కడికి వెళ్లడమే గాక ఫోటో దిగి బుక్కయ్యాడు టీఆర్ఎస్ నేత నాయకపు వెంకటేశ్.

in strong room took photo evm : case registered

ఆర్వో ఫిర్యాదుతో కేసు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం బోగారంలోని హోళీమేరీ ఇంజినీరింగ్ కాలేజీలో ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్ రూంలోకి వెళ్లిన టీఆర్ఎస్ నేత నాయకపు వెంకటేశ్ ఏకంగా ఫోటోలు తీసుకున్నారు. అలాగని ఊరికే ఉండలేదు .. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికారులు స్పందించారు. వెంకటేశ్ చర్యపై రిటర్నింగ్ అధికారి ఎస్వీఆర్ చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై కీసర పోలీసులు క్రైమ్ నెం 149/2019, అండర్ సెక్షన్ 447, 188 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+