Telangana Budget 2024: వ్యవసాయ రంగానికి రూ. 72 వేల 659 కోట్లు..
డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రూ. 72 వేల 659 కోట్లు కేటాయించారు. తెలంగాణ బడ్జెట్‌లో మొత్తం వ్యయం 2,91,159 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్ల రూపాయలు. మూల ధన వ్యయం 33,487 కోట్ల రూపాయల ప్రతిపాదించారు.
గ్యాస్ సబ్సిడీ పథకానికి బడ్జెట్ లో 723 కోట్ల రూపాయలు కేటాయించగా.. గృహ జ్యోతి పథకానికి 2 వేల 418 కోట్ల రూపాయలు కేటాయించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 29 వేల 816 కోట్లు కేటాయించగా.. హైదరాబాద్ సిటీ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమానికి రూ. 9 వేల 200 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ. 3 వేల 3 కోట్లు, గృహ జ్యోతి పథకానికి 2 వేల 418 కోట్ల రూపాయలు కేటాయించారు.

అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ. 72 వేల 659 కోట్లు కేటాయించడంతో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీని ప్రకటించారు. ఇప్పటికే రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేశారు. ఆగస్ట్ 15 లోపు రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. అలాగే రైతులకు రైతు భరోసా కూడా ఇవ్వనున్నారు. ఇంకా రైతు బీమా, పంట నష్ట పరిహారం కూడా ఉంటుంది. అందుకే వ్యవసాయానికి భారీగా నిధులు కేటాయించారు.
నిరుపేద కూలీలకు ఈ ఏడాది నుంచి రూ. 12 వేలు అందించనున్నారు. ఇందుకు సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ. 100 కోట్లు, ఓఆర్ఆర్ వరకు మెట్రో విస్తరణకు రూ. 200 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స కు రూ. 3వేల 385 కోట్లు,
పశుసంవర్ధకశాఖకు రూ. 1980 కోట్లు, సివిల్ సప్లై కోసం రూ. 3 వేల 836 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ కోసం బడ్జెట్ లో 100 కోట్ల రూపాయలు కేటాయించగా.. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కోసం బడ్జెట్ లో రూ.15 వందల కోట్లు కేటాయించారు.












Click it and Unblock the Notifications