హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్‌పై రూ.వెయ్యి కోట్ల అక్రమార్జన ఆరోపణలు, ఆ కంపెనీ అడ్డాగా? ఎన్నికల అఫిడవిట్లో ఇలా..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నివాసం, అతని బంధువుల నివాసాల్లో ఐటీ అధికారులు గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయనను ఆదేశించగా, సాయంత్రం కోస్గిలో బహిరంగ సభ అనంతరం ఆయన వచ్చారు. రేవంత్ అధికారుల విచారణలో పాల్గొంటారు.

Recommended Video

రేవంత్ ఇంటి పై ఆదాయపన్ను శాఖ దాడులు

రేవంత్ రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ దాడులు: ఏకకాలంలో 15చోట్ల, బంధువుల ఇళ్లలోను, ఫోన్లు స్విచ్చాఫ్రేవంత్ రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ దాడులు: ఏకకాలంలో 15చోట్ల, బంధువుల ఇళ్లలోను, ఫోన్లు స్విచ్చాఫ్

రేవంత్ పైన లాయర్ రామారావు సీబీఐకి ఫిర్యాదు చేశారు. రేవంత్ బంధువు జయప్రకాశ్ తదితరులు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సాయిమౌర్య ఎస్టేట్ అండ్ ప్రాజెక్టు లిమిటెడం్ తరఫున పది నుంచి 15 డొల్ల కంపెనీల నుంచి వందల కోట్ల నిధులు మళ్లించారని ఆరోపించారు. ఈ డొల్ల కంపెనీలు జూబ్లీహిల్స్ ఇంటి నెంబర్ 346 చిరునామాతో ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనపో సోదాలు జరుగుతున్నాయి. రేవంత్ పైన వస్తున్న ఆరోపణలు ఇలా ఉన్నాయి...

రూ.వెయ్యి కోట్ల అక్రమార్జన, విదేశీ మారకద్రవ్యం తరలింపు

రూ.వెయ్యి కోట్ల అక్రమార్జన, విదేశీ మారకద్రవ్యం తరలింపు

రేవంత్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులపై భారీ ఎత్తున అక్రమ ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. నేరపూరిత చర్యల ద్వారా దాదాపు రూ.వెయ్యి కోట్లు అక్రమార్జనకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది. అనేక షెల్ కంపెనీల ద్వారా అడ్డదారుల్లో విదేశీ మారకద్రవ్యం తరలించారని ఆరోపణలు ఉన్నాయి.

ఒకేరోజు రూ.20 కోట్లు అకౌంట్లోకి, విదేశాల్లో అక్రమాస్తులు

ఒకేరోజు రూ.20 కోట్లు అకౌంట్లోకి, విదేశాల్లో అక్రమాస్తులు

2014లో ఒకేరోజు రూ.20 కోట్ల విదేశీ ధనం రేవంత్ రెడ్డి అకౌంట్లోకి చేరిందని ఫిర్యాదు అందినట్లుగా తెలుస్తోంది. దుబాయ్, అమెరికా, మలేషియా, హాంకాంగ్ దేశాలలో వీరికి అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో పాటు అల్లుడు, వియ్యంకుడు, సోదరుల పైనా అక్రమాల ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది.

నాటి ఎన్నికల అఫిడవిట్లో రూ.3.6 కోట్లు, 2014లో రూ.13.12 కోట్లు

నాటి ఎన్నికల అఫిడవిట్లో రూ.3.6 కోట్లు, 2014లో రూ.13.12 కోట్లు

రేవంత్ రెడ్డి 2009లో తన ఎన్నికల అఫిడవిట్లో రూ.3.6 కోట్ల ఆస్తులను చూపించారు. 2014లో ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో రూ.13.12 కోట్ల ఆస్తులను చూపించారు. రేవంత్ రెడ్డి ఆదాయం ఏడాదికి రూ.5 లక్షలు. మరి అయిదేళ్లలో రూ.10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఫిర్యాదుదారు ప్రశ్నించాడని తెలుస్తోంది.

అక్రమాలకు అడ్డాగా నెక్స్‌స్ ఫీడ్స్

అక్రమాలకు అడ్డాగా నెక్స్‌స్ ఫీడ్స్

రేవంత్ రెడ్డి వియ్యంకుడి నెక్స్‌స్ ఫీడ్స్ సంస్థ అక్రమాలకు ప్రాంగణంగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకులను మోసం చేసి రూ.65 కోట్లు, వ్యవసాయ రుణాల పేరుతో రూ.76 కోట్లు దోచారని అంటున్నారు. రేవంత్ పైన ఫెమా నిబంధనల ఉల్లంఘన, బినామీ లావాదేవీలు, బ్యాంకు రుణాల దారి మళ్లింపు ఆరోపణలు వచ్చాయి. తెలంగాణలో అనేకభూఆక్రమణలకు పాల్పడినట్లు కూడా రేవంత్ పైన ఆరోపణలు ఉన్నాయని అంటున్నారు.

19 కంపెనీల ద్వారా రేవంత్ అక్రమాలు

19 కంపెనీల ద్వారా రేవంత్ అక్రమాలు

మొత్తం 19 కంపెనీల ద్వారా రేవంత్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థలలో ఉన్న 23 మంది డైరెక్టర్లు కూడా రేవంత్ రెడ్డితో సంబంధం ఉన్నవారేనని ఆరోపణలు ఉన్నాయి. సాయిమౌర్య, నైమిషా, అవలాంచె ఇన్ ఫ్రా టెక్ తదితర కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు జరిపినట్లుగా గుర్తించారని తెలుస్తోంది.

English summary
Income Tax department on Thursday raided the residence and offices of former legislator and Telangana Pradesh Congress Committee working president Anumula Revanth Reddy in Hyderabad, triggering a war of words between the state unit of the Congress and the ruling TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X