తెలంగాణలో ఒమిక్రాన్ విజృంభణ: గంటగంటకూ: దేశంలో 200ల కేసులు: రాష్ట్రాలవారీగా లెక్కలివే
హైదరాబాద్: కరోనా వైరస్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో విస్తరిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రెండు రోజుల కిందటి వరకు 150గా నమోదైన ఈ కేసుల సంఖ్య ఇప్పుడు 200కు చేరింది. 48 గంటల వ్యవధిలో 50 కొత్త కేసులు దేశంలో నమోదయ్యాయంటే.. ఈ వేరియంట్ ఎంత వేగంగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఒమిక్రాన్ వల్ల ఇప్పటిదాకా మరాణాలేవీ నమోదు కాకపోవడం ఊరట కలిగించే విషయం.
Recommended Video
ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు పెరుగుతోండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకునే అవకాశాలు లేకపోలేదు. క్రిస్మస్ పర్వదినం, కొత్త సంవత్సరం వేడుకలను దృష్టిలో ఉంచుకుని కొత్త కోవిడ్ ప్రొటోకాల్స్‌ను జారీ చేయొచ్చని తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ దిశగా కసరత్తు చేస్తోంది. దేశంలో మళ్లీ కోవిడ్ ఆంక్షలు అమలు కావచ్చని అంటున్నారు. ఇందులో భాగంగా నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలను ఆరోగ్యశాఖ అధికారులు పరిశీలిస్తున్నారనే ప్రచారం ఉంది.

దేశంలో ఇప్పటిదాకా నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య 200కు చేరింది. 77 మంది దీని బారి నుంచి బయటపడ్డారు. ఆరోగ్యంతో కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 123గా రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రాలవారీగా వాటి సంఖ్యను వెల్లడించింది. ఇప్పటిదాకా 12 రాష్ట్రాల్లో ఈ వేరియంట్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. మహారాష్ట్ర, ఢిల్లీల్లో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఈ రెండు చోట్ల కూడా 54 మంది చొప్పున ఒమిక్రాన్ బారిన పడగా 40 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. మహారాష్ట్ర-28, ఢిల్లీ-12 మంది డిశ్చార్జ్ అయ్యారు. అత్యధిక పాజిటివ్ కేసులను నమోదు చేసిన రాష్ట్రాల జాబితాలో ఈ రెండు అగ్రస్థానంలో ఉన్నాయి. మూడో స్థానంలో తెలంగాణ నిలిచింది. 20 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. డిశ్చార్జీలు జీరో. ఒమిక్రాన్ సోకిన వారందరూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

నాలుగో స్థానంలో కర్ణాటక నిలిచింది. ఈ రాష్ట్రంలో 19 కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్-18, కేరళ-15, గుజరాత్-14, ఉత్తర ప్రదేశ్-2 కేసులు రికార్డయ్యాయి. ఏపీ, చండీగఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లల్లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీ, పశ్చిమ బెంగాల్‌లల్లో ఒమిక్రాన్ బాధితులు కోలుకున్నారు. ఆరోగ్యవంతులయ్యారు. ఉత్తర ప్రదేశ్‌లోనూ ఒమిక్రాన్ పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యారు.












Click it and Unblock the Notifications