తెలంగాణలో భారీగా నమోదైన కరోనా కొత్త కేసులు... మరో 18 మంది మృతి...

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత కొద్దిరోజులుగా వరుసగా 4వేల మార్క్‌ను దాటిన కేసులు.. తాజాగా 5వేల మార్క్‌ని చేరాయి. ఆదివారం(ఏప్రిల్ 18) రాత్రి 8గం. నుంచి సోమవారం రాత్రి 8గం. వరకు 5926 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 18 మంది కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం(ఏప్రిల్ 20) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

పూర్తి వివరాలు...

పూర్తి వివరాలు...

మరో 6033 రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,359కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1856కి చేరింది. ప్రస్తుతం 42,853 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 2209 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,16,650కి చేరింది.ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.2శాతం ఉండగా... తెలంగాణలో 0.51శాతం ఉంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 85.6 శాతం ఉండగా తెలంగాణలో 87.62 శాతం ఉంది. తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 793 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,19,42,985కరోనా టెస్టులు నిర్వహించారు.

కోలుకుంటున్న కేసీఆర్...

కోలుకుంటున్న కేసీఆర్...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలతో కరోనా బారినపడిన ఆయన ప్రస్తుతం ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితి తలెత్తితే హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికైతే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. మొదట కొంత జ్వరం,ఒళ్లు నొప్పులు ఉన్నప్పటికీ ఇప్పుడు అవి కూడా లేవని చెప్పారు. కాబట్టి కంగారుపడాల్సిన పనేమీ లేదని చెప్పారు.

దేశవ్యాప్తంగా 2,59.170 కేసులు...

దేశవ్యాప్తంగా 2,59.170 కేసులు...

ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2,59,170 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,53,21,089కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19,29,329 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 1,761 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,80,530కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 1,31,08,582 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 20,31,977 మంది ప్రస్తుతం ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ 12,71,29,113 మంది వ్యాక్సిన్లు తీసుకున్నారు.

Recommended Video

    COVID-19 Predominantly Spreads Through Air - Lancet Study || Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+