పాక్‌కు మోడీ 'సర్జికల్' దెబ్బ: పక్కా ప్లాన్, ఆ ఒప్పందాలను అనుసరించే..
న్యూఢిల్లీ: యూరి ఉగ్రదాడి అనంతరం ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్‌ను ఏకాకిని చేసిన మోడీ ప్రభుత్వం.. ఆ తర్వాత సర్జికల్ స్ట్రయిక్ చేసింది. ఈ విషయంలో అంతర్జాతీయంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీ ప్రణాళికతో నిర్వహించింది.
ఉగ్ర శిబిరాలపై దాడుల విషయంలో సిమ్లా ఒప్పందానికి భారత్ కట్టుబడే ఉందని అంటున్నారు. ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ నియమావళిని కూడా అనుసరించింది. ఇరవై నాలుగు గంటల్లో పాక్ బలగాలు రెండుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో భారత్ స్పందించింది.
ముఖ్యంగా భారత్‌లో దాడులు చేపట్టేందుకు సిద్దమవుతున్న శిబిరాల పైనే సైనిక చర్యకు దిగింది. దాడుల విషయంలో పాక్ ఏ విధంగా స్పందించినప్పటికీ అంతర్జాతీయంగా కూడా సమస్యలు రాని విధంగా దాడులు నిర్వహించిందని అంటున్నారు.

కాల్పుల విరమణపై పాక్‌తో ద్వైపాక్షిక కట్టుబాట్లు, ఐరాస నిబంధనలకు భారత్ ఎప్పుడూ కట్టుబడే ఉంది. ఐరాస 2(4) నిబంధన ప్రకారం.. సభ్య దేశాలు ఇతరులపై బలగాలను ప్రయోగించకుండా నిగ్రహంతో ఉండాలి. ముఖ్యంగా అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించేందుకు సాయుధ బలగాలను ఉపయోగించకూడదు. దీని ఆధారంగానే 1972లో సిమ్లా ఒప్పందం రూపుదాల్చింది.
బలగాలతో కాకుండా శాంతి మార్గాల్లో సమస్యలను పరిష్కరించుకుంటామని దీనిలో భారత్, పాకిస్తాన్ స్పష్టం చేశాయి. ఉగ్రవాదులు తమ ప్రాంతాలను ఉపయోగించుకొని, పక్క దేశంపై దాడులకు తెగబడకుండా చూస్తామని అంగీకరించాయి. ఇప్పుడు బాక్ సర్జికల్ స్ట్రయిక్ నిర్వహించింది ఉగ్రవాదుల పైనే కావడం గమనార్హం.
అదేవిధంగా, పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై చేపట్టిన దాడులను భారత్ కెమెరాలతో చిత్రీకరించింది. కొన్ని చోట్ల డ్రోన్లను కూడా వినియోగించింది. వీటి ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నట్లు నిర్ధారించేందుకు అవకాశముంది.












Click it and Unblock the Notifications