తెలంగాణలో భారీ మెజారిటీతో అధికారం ఖాయం..!!

India TV-CNX exit polls: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 62 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు సమాచారం. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడుతున్నాయి. తెలంగాణతో పాటు అయిదు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో వివిధ సంస్థలు నిర్వహించి ఎగ్జిట్ పోల్స్ వివరాలు అందుతున్నాయి.

Recommended Video

    Congress హస్తం హవా..KCR కారుకు షాక్.. Telangana Election Results | Exit Polls | Telugu oneindia

    తెలంగాణపై ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ (India TV-CNX) నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ (Telangana Exit Polls)లో భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడ- అధికార భారత్ రాష్ట్ర సమితికి నిరాశ తప్పదని తేల్చిందీ సర్వే. కాంగ్రెస్ వైపునకు మొగ్గు చూపింది. హస్తం పార్టీకి భారీ సంఖ్యలో సీట్లను గెలుస్తుందని అంచనా వేసింది.

    India TV-CNX exit polls on Telangana predicts Congress will get huge majority

    తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం.. 60. బీఆర్ఎస్ ఈ మేజిక్ ఫిగర్‌ను అందుకోలేదని అంచనా వేసింది. 31 నుంచి 47 స్థానాలకే పరిమితమౌతుందని అభిప్రాయపడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం అసాధ్యమని వివరించింది.

    మూడోసారి అధికారంలోకి రావాలనే బీఆర్ఎస్ ఆశలు ఏవీ ఫలించబోవని ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ (India TV- CNX exit polls on Telangana) ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది. తెలంగాణలో మరోసారి గులాబీ జెండా ఎగురకపోవచ్చని, కారు జోరు తగ్గుతుందని వివరించింది.

    ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తి మోజారిటీని సాధిస్తుందని ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ తెలిపింది. ఏకంగా 63 నుంచి 79 స్థానాలతో హస్తం పార్టీ జెండా ఎగురవేస్తుందని తేల్చింది. బీజేపీకి రెండు నాలుగు సీట్లకే పరిమితమౌతుంది. అఖిల భారత్ మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌కు అయిదు నుంచి ఏడు సీట్లు దక్కుతాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+