బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గూగుల్ స్ట్రీట్ వ్యూలో ‘3డీ’లో భారత్ అందాలు: చార్మినార్ కూడా..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేశంలోని అన్ని నగరాలు, పర్వతాలు, నదులు, ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాలను 3డీలో, 360 డిగ్రీల కోణంలో అత్యంత స్పష్టంగా కళ్లకు కట్టినట్లుగా ఇక ముందు ‘గూగుల్ స్ట్రీట్ వ్యూ'లో వీక్షించే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది.

అందుకు భారత ప్రభుత్వం గూగుల్ కు అనుమతి ఇవ్వడానికి సిద్దం అయ్యిందని మంగళవారం సంబంధిత అధికారులు న్యూఢిల్లీలో చెప్పారు. అయితే రక్షణ రంగ నిర్మాణాలు, అణు కార్యక్రమాల ప్రదేశాలతో పాటు దేశంలోని సున్నితమైన ప్రాంతాలు గూగుల్ లో అందుబాటులోకి రావని అధికారులు అన్నారు.

దేశంలోని సుందరమైన ప్రాంతాలు ప్రజలు వీక్షించడానికి వీలుగా ప్రముఖ ఇంటర్నెట్ సంస్థ గూగుల్ కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇప్పటికే కేంద్ర హోం శాఖ, రక్షణ, విదేశీ వ్యవహారాలు, పీఎంఓ శాఖల ఉన్నతాధికారులు ఈ విషయంపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

Indian cities, tourist spots in Google Street View

దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించారని, గూగుల్ కు లాంఛనంగా త్వరలో సమాచారం అందిచనున్నామని సంబంధింత అధికారులు స్పష్టం చేశారు. గూగుల్ స్ట్రీట్ ప్యూలో 2007 నుంచి అమెరికా, కెనడా, యూరోప్ దేశాల అందమైన ప్రదేశాలు గూగుల్ స్ట్రీట్ వ్యూలో ఉన్నాయి.

ఆదేశాలలో వీటిని విసృతంగా వినియోగిస్తున్నారు. భారత్ లో తాజ్ మహల్, ఎర్రకోట, వారణాసి నదీ తీరం, కుతుబ్ మినార్, చార్మినార్, నలంద యూనివర్శిటి, తంజావూరు, మైసూరు ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్, జోగ్ ఫాల్స్ తదితర సుందరమైన ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు ఉన్నాయి.

గూగుల్ స్ట్రీట్ ప్యూలో ప్రపంచ వ్యాప్తంగా అందురూ చూడటానికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. భారత పురావస్తు పరిశోధక శాఖ భాగస్వామ్యంతో గూగుల్ తన ‘స్ట్రీట్ వ్యూ'లో భారత అందాలు పోందుపరచనుంది. గూగుల్ మ్యాప్ లో నీలిరంగు రేఖల ద్వార వీటిని గుర్తించడానికి అవకాశం ఉంటుంది.

English summary
Indian cities, tourists spots, hills and rivers could be explored soon through 360-degree.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X