పెట్టుబడులకు చైనా కంపెనీల ఆసక్తి: కేసీఆర్‌తో బీజింగ్‌లో భారత రాయబారి
హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపనీలు ఆసక్తిగా ఉన్నాయని బీజింగ్‌లో భారత రాయబారి నామ్ గ్యా సీ కంపా తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన అధికారిక నివాసంలో మంగళవారం ఆమె కలిశారు.
ఈ సందర్భంగా ఇటీవల తన చైనా పర్యటనలో పలు కంపెనీలతో మాట్లాడానని పలు కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కనబర్చాయన్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి పరిస్థితిని స్వయంగా చూసి వెళ్లారని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ చట్టాన్ని చైనాలోని పలు కంపెనీలు ఇప్పటికే అధ్యయనం చేశాయని ఆయన కేసీఆర్‌కు వివరించారు. రాబోయే కాలంలో చైనా కంపెనీలు తెలంగాణలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన చెప్పారు.
చివరగా, హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పన, కనీస అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు వివరించారు.
తాగునీటి కార్పొరేషన్ ఎండీగా ఎస్పీ సింగ్
తెలంగాణ రాష్ట్ర తాగునీటి కార్పొరేషన్ ఎండీగా ఎస్పీ సింగ్ నియమితులైయ్యారు. పంచాయతీరాజ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్పీ సింగ్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంపై ఎస్పీ సింగ్ ఎప్పటికప్పుడు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ మార్గనిర్దేశం చేస్తున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications