Vande Bharat:వారానికి రెండు వందే భారత్ రైళ్లు - తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా..!!

తెలుగు రాష్ట్రాల్లో మూడు వందేభారత్ రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది.

వందేభారత్ రైళ్లను ఆదరణ పెరుగుతోంది. కేంద్ర బడ్జెట్ లోనూ రైల్వే శాఖ ప్రతిపాదనల్లో ఈ రైళ్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. తాజాగా ప్రధాని మంత్రి వందేభారత్ గురించి ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒక రైలు సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడుస్తోంది. త్వరలోనే వారానికి రెండు రైళ్లకు పెంచేలా రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. దేశ వ్యాప్తంగా వందేభారత్ ఈ ఏడాది ఆగస్ట్ 15 నాటికి 75 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు మూడు వందేభారత్ రైళ్లను కేటాయించింది. వాటిలో ఒక రైలు వచ్చే నెలాఖరులోగా పట్టాలెక్కనుంది. దీనికి సంబంధించి ట్రయిల్ రన్ కూడా పూర్తి చేసారు.

నగరం - పట్టణాల మధ్య వారధిగా

నగరం - పట్టణాల మధ్య వారధిగా

వందేభారత్ రైళ్లను మరిన్ని ప్రవేశ పెట్టేందుకు కేంద్రం కసరత్తు వేగవంతం చేసింది. దీనికి సంబంధించి కేంద్రం రైల్వే శాఖ మంత్రి కీలక ప్రకటన చేసారు. దేశీయంగా సిద్దమవుతున్న వందేభారత్ రైళ్లు దేశంలోని ప్రతి ప్రధాన నగరం, చిన్న పట్టణాన్ని కవర్ చేస్తాయని వెల్లడించారు. ఈ రైళ్ల డిజైన్, సాంకేతికత ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని చెప్పుకొచ్చారు. వందేభారత్ తో పాటుగా వందే మెట్రో ద్వారా ప్రతీ నగరం నుంచి పట్టణాలను కవర్ చేసే విధంగా కనెక్టివిటీ పెరిగేలా వందేభారత్ - వందే మెట్రో ని ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రతి వారం రెండు లేదా మూడు వందే భారత్ రైళ్లను నడిపించగలిగేలా ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారిస్తున్నామని రైల్వే మంత్రి ప్రకటించారు.

ఆగస్టు నాటికి 75 వందేభారత్

ఆగస్టు నాటికి 75 వందేభారత్

ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం నాటికి దేశ వ్యాప్తంగా 75 వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తేనున్నారు. దీనికి సంబంధించి ప్రాధమిక కసరత్తు పూర్తి చేసారు. అందులో ఈ నెలలోనే రెండు కొత్త వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఫిబ్రవరి 10న ముంబయి - షిరిడీ, ముంబయి - షోలాపూర్ రూట్లలో రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా డిమాండ్ ఉన్న రూట్లలో కొత్త వందేభారత్ రైళ్లను నడిపే విధంగా రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే మూడేళ్ల కాలంలో దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లను ప్రవేశ పెట్టాలనేది రైల్వే శాఖ లక్ష్యం. ఇందులో భాగంగా ఇప్పటి వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ లో తయారవుతోంది. చెన్నైతో పాటు.. హర్యానాలోని ఐసీఎఫ్ సోనిపట్, మహారాష్ట్రలోని ఐసీఎఫ్ లాతూర్, ఉత్తరప్రదేశ్‌లోని ఐసీఎఫ్ రాయ్ బరేలీకి విస్తరించనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రైళ్లు..

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రైళ్లు..

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సికింద్రాబాద్ - విశాఖ మధ్య ఒకే రైలు నడుస్తోంది. క్రమేణా ఈ రైలుకు ఆదరణ పెరుగుతోంది. తొలుత అధిక ధరల పేరుతో కొన్ని విమర్శలు వినిపించినా.. తరువాత పెరిగిన ఆక్యెపెన్సీతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు వందేభారత్ రైళ్లను నడపాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ - తిరుపతి.. సికింద్రాబాద్ - పూణే..కాచిగూడ- బెంగుళూరు మధ్య ఈ మూడు రైళ్లను నడపనున్నారు. అందులో భాగంగా ముందుగా సికింద్రాబాద్ - తిరుపతి రైలును వచ్చే నెలలోనే ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందు కోసం ఇప్పటికే ట్రాక్ పరిశీలన..ట్రయిల్ రన్ పూర్తి చేసారు. రేణిగుంట నుంచి చెన్నై వరకు వందేభారత్ మెట్రో నడిపే విధంగా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. మార్చి నెలాఖరులోగా సికింద్రబాద్ - తిరుపతి వందేభారత్ పట్టాలెక్కనుంది. ఆ తరువాత ఆగస్టు లోగా మిగిలిన రెండు రైళ్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+