త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి: తెలంగాణ నుంచి మూడో నేత
హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి (Nallu Indrasena Reddy)కి కీలక పదవి వరించింది. త్రిపుర కొత్త గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయనతోపాటు ఒడిశా గవర్నర్‌గా జార్ఖండ్ మాజీ సీఎం రఘువర్ దాస్‌ను నియామకం జరిగింది.
కాగా, నల్లు ఇంద్రసేనా రెడ్డి తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన వారు. ఆయన గతంలో మలక్‌పేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా నల్లు ఇంద్రసేనా రెడ్డి పనిచేశారు. తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు.
కాగా, ఇప్పటికే తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు గవర్నర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. సీహెచ్ విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. ప్రస్తుతం హర్యానా గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ పనిచేస్తున్నారు. తాజాగా, ఇంద్రసేనా రెడ్డి గవర్నర్‌గా నియామకం కావడం గమనార్హం. ఏపీ బీజేపీకి చెందిన కంభంపాటి హరిబాబు ఇటీవల మిజోరాం గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే.

ఇంద్రసేనారెడ్డి సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామంలో నల్లు రాంరెడ్డి, హనుమాయమ్మ దంపతులకు జన్మించారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1972లో ఎంఎస్సి పూర్తి చేశారు. వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ నుంచి 1975లో ఎం.ఫీల్ పూర్తి చేశారు.
ఇంద్రసేనారెడ్డి విద్యార్థి దశ నుంచి రాజకీయాల పట్ల ఆశక్తితో 1980లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన 1983, 1985, 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మలక్‌పేట్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 1996, 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ లోకసభ నియోజకవర్గం నుంచి, 2009లో మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం నుంచి 2014లో భువనగిరి లోకసభ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
ఇంద్రసేనా రెడ్డి బీజేపీలో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశారు. 2022లో రాష్ట్రంలో బీజేపీ చేరికలు, సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా ఇంద్రసేనా రెడ్డి వ్యవహరించారు. మరోవైపు, ఒడిశా కొత్త గవర్నర్‌గా నియమితులైన రఘుబర్ దాస్ 2014 నుంచి 2019 వరకు జార్ఖండ్ సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications