Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొమురం భీం జిల్లాలో దారుణం .. బాలింతను అడవిలో వదిలేసి వెళ్ళిన 102 సిబ్బంది తీరు అమానవీయం

కొమురం భీం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండలం కమ్మర్ గావ్ లో పసికందుకు జన్మనిచ్చిన ఓ బాలింతను అడవిలో వదిలి పెట్టి 102 సిబ్బంది వెళ్ళిపోయిన అమానవీయ ఘటన చోటు చేసుకుంది .దీంతో ఆమె తన సొంత ఊరికి చేరుకోవడానికి అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ పడరాని పాట్లు పడి తన స్వగ్రామానికి చేరుకుంది. ఇక ఈ ఘటన అధికారులు, ప్రజాప్రతినిధుల పట్టింపులేని తనానికి అద్దం పడుతుంది.

బాలింతను ఇంటికి చేర్చకుండా మధ్యలోనే వదిలి వెళ్ళిన 102 సిబ్బంది

బాలింతను ఇంటికి చేర్చకుండా మధ్యలోనే వదిలి వెళ్ళిన 102 సిబ్బంది

వివరాల్లోకి వెళితే కొమురం భీం జిల్లా మొర్లిగూడా గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ పొర్రెడ్డి కవితకు బుధవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో డెలివరీ కోసం కాగజ్ నగర్ ఆసుపత్రికి ఆమె కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. కాగజ్ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. నార్మల్ డెలివరీ అయిన కవితను ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా ఆసుపత్రి వర్గాలు సూచించడంతో 102 సిబ్బంది ఆమెను అంబులెన్స్ లో ఇంటికి తరలించడానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో వారు కమ్మర్ గావ్ వరకే అంబులెన్స్ వస్తుందని, అక్కడి నుండి నడిచి వెళ్లాల్సి ఉందని తేల్చి చెప్పారు.

కమ్మర్ గావ్ నుండి మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళిన బాలింత


దీంతో కమ్మర్ గావ్ నుండి మూడు కిలోమీటర్ల మేర మొర్లిగూడా గ్రామానికి అడవిలో ఇబ్బందిపడుతూ నడుచుకుంటూ వెళ్లింది సదరు బాలింత. అంబులెన్స్ సిబ్బంది ఎలాంటి కనికరము లేకుండా పచ్చి బాలింత అటవీ ప్రాంతంలో వదిలిపెట్టి వెళ్లారని కవిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ వద్ద 400 రూపాయలను కూడా తీసుకున్నట్టు వారు తెలిపారు. మొర్లిగూడా గ్రామానికి వెళుతున్న దారి మొత్తం రాళ్లతో నిండి ఉండటంతో, బాలింత నడవడానికి అష్టకష్టాలు పడింది. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తమ రహదారిని బాగు చేయాలని మొర్లిగూడా గ్రామస్తులు అభ్యర్థిస్తున్నారు.

మారుమూల అటవీ ప్రాంతాలలో మౌలిక వసతుల లేమితో స్థానికులకు కష్టాలు

అటవీ ప్రాంతాలలో జీవిస్తున్న ఎంతో మంది గిరిజన మహిళలు డెలివరీ కోసం డోలీలు కట్టుకొని ఆసుపత్రికి మోసుకు వెళుతున్న ఘటనలు అనేకం చూస్తున్నాం.తాజాగా బాలింతలు సైతం తమ గ్రామాలకు దారిలేక నడుచుకుంటూ వెళుతూ పడరాని పాట్లు పడుతున్న సందర్భాలు మనసులను కలచివేస్తున్నాయి. ఏజెన్సీలలో చోటు చేసుకుంటున్న ఇలాంటి అమానవీయ ఘటనలు నాగరిక సమాజాన్ని నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఏది ఏమైనా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించడం లేదని తాజా పరిణామాలతో అర్థమౌతుంది.

ప్రభుత్వాలు దృష్టిప్రభుత్వాలు దృష్టి సారించాలని విజ్ఞప్తి సారించాలని విజ్ఞప్తి

శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధించిన నేటి రోజుల్లోనూ ఇలాంటి ఘటనలు ప్రభుత్వాల అసమర్థతను నిత్యం ప్రశ్నిస్తున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇది తెలంగాణ రాష్ట్రంలోనూ ఏజెన్సీ ప్రాంతాలలో , మారుమూల కుగ్రామాలలో జీవిస్తున్న వారు ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకుండా అవును వెళ్లదీస్తున్నారు అన్నది అందరూ అంగీకరించాల్సిన నిజం. ఇక ఈ పరిస్థితులపై దృష్టి పెట్టాలనేది, కనీస వసతులు కల్పించాలనేది ప్రతి ఒక్కరి విన్నపం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+