అడిగిందేంటి? ఇచ్చిందేంటి?.. కేంద్ర బడ్జెట్‌పై సీఎం రేవంత్, శ్రీధర్ బాబు
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి వచ్చిన కేటాయింపులపై మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. శనివారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వారితో సుదీర్ఘంగా చర్చించారు.
రాష్ట్రం పంపిన విజ్ఞప్తులు, కేంద్రం ఇచ్చిన నిధుల వ్యత్యాసంపై చర్చించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని.. దీనిపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు సీఎం రేవంత్. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే పెద్ద పీట వేశారన్నారు. మిగిలిన రాష్ట్రాలను పూర్తిగా విస్మరించారన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ ఎంపీలతో చర్చించి.. పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తామని సీఎం రేవంత్ చెప్పారు.

అడిగిందేదీ ఇవ్వలేదు: మంత్రి శ్రీధర్ బాబు
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బడ్జెట్ కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు, ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకే దక్కాయన్నారు. కేంద్ర జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం ఉన్నప్పటికీ ఆ మేరకు కూడా నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో రూ. 26 వేల కోట్లు కేంద్రానికి వెళ్లాయని తెలిపారు.
గతంలో కంటే ఇది 12 శాతం మేర పెరిగినా.. రాజకీయ కారణాలతో తెలంగాణపై చిన్నచూపు చూశారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీజేపీకి 8 ఎంపీలను ఇచ్చిన తెలంగాణ ప్రజలకు మోడీ ప్రభుత్వం ద్రోహం చేసిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలుమార్లు ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులను కలిసి సహాయం కోసం అభ్యర్థించారని చెప్పారు.
హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టు విస్తరణకు కేంద్రం వాటాగా రూ. 17,212 కోట్లు కేటాయించాలని కోరినా.. రూపాయి కూడా ఇవ్వలేదని శ్రీధర్ బాబు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలకు సీఎస్ఎంపీ కింద భూగర్భ డ్రైనేజీకి నిధులు కేటాయించాలని విన్నవించుకున్నా.. బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
-
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications