పురుగులు ఉన్న సెలైన్ బాటిల్‌ను యువతికి ఎక్కించారు
పురుగులు ఉన్న సెలైన్ బాటిల్‌ను యువతికి ఎక్కించారు
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి లో అత్యవసర విభాగంలో పేషెంట్ల కు పురుగులు పట్టిన సెలైన్ బాటిల్స్ ఎక్కించి ఒక చిన్నపాప ప్రాణాలతో చెలగాటమడిన ఘటన చోటుచేసుకుంది. గాంధీ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల.. చూడకుండా సాయి ప్రవళిక అనే 6 సంవత్సరాల పాపకు పురుగులున్న సెలైన్ ను ఎక్కించారు. పాప బంధువులు చూసి ఆందోళన చేయడంతో ఆస్పత్రి సిబ్బంది కంగారుతిన్నారు. ఎన్నిసార్లు అధికారులు వార్నింగ్ ఇచ్చినా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి సిబ్బంది లో మాత్రం మార్పు రావడం లేదు అనడానికి ఇది మరొక నిదర్శనం.












Click it and Unblock the Notifications