ప్రియుడి మోజు తీర్చడానికి కన్న తల్లికే ఎసరు పెట్టింది!

నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు ఎంతటి దారుణాలకు దారితీస్తున్నాయో చెప్పడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఇన్ స్టాగ్రామ్ లో మొదలైన ఒక పరిచయం.. చివరకు ఒక తల్లి కడుపు కోతకు, కూతురి విచక్షణారహిత నిర్ణయానికి కారణమైంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన ఒక యువతికి, ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులకే ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే, ఆ ప్రేమలో నిజాయితీ కంటే అవసరాలే ఎక్కువగా ఉన్నాయని ఆ యువతి గ్రహించలేకపోయింది. తన 'ప్రేమ'కు నిదర్శనంగా తనకు ఒక ఖరీదైన బైక్ కొనివ్వాలని సదరు యువకుడు డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు.

Instagram Love Trap Girl Sells Mother s Gold to Buy Expensive Bike for Boyfriend in Rajanna Sircilla

తల్లి నగలే కూతురికి వేలంపాటయ్యాయి..

ప్రియుడు అడిగిన బైక్ కొనివ్వడానికి ఆ యువతి దగ్గర సరిపడా డబ్బు లేదు. కానీ, ఎలాగైనా అతడి కోరిక తీర్చాలన్న మొండితనంతో కన్నతల్లి శ్రమకు గుర్తుగా ఇంట్లో దాచుకున్న బంగారు నగలను ఆ యువతి కళ్లజూసింది. తల్లికి తెలియకుండా ఇంట్లోని నగలను తీసుకెళ్లి విక్రయించి, ఆ వచ్చిన సొమ్ముతో తన ప్రియుడికి అతను కోరుకున్న 'లగ్జరీ బైక్'ను కొని ఇచ్చింది. తన తల్లి రక్తాన్ని చెమటగా మార్చి కూడబెట్టిన సొమ్మును, కేవలం ఒక ఇన్‌స్టా పరిచయం కోసం ఆ యువతి ఇలా తగలేసింది.

పోలీసుల చెంతకు చేరిన పంచాయితీ!

చాలా రోజుల తర్వాత ఇంట్లో ఉండాల్సిన బంగారం మాయమైనట్లు గుర్తించిన తల్లి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. కన్నకూతురే ఈ పని చేసిందని తెలియడంతో ఆమె ఆవేదనకు అంతులేకుండా పోయింది. చేసేదేమీ లేక, చివరకు ఎల్లారెడ్డిపేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అసలు ఏం జరిగిందనే కోణంలో విచారణ చేపట్టి, ఆ యువతిని, ఆమె ప్రియుడిని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+