షాకింగ్: రేవంత్ ఇంటి చుట్టూ ఇంటెలిజెన్స్ అధికారులు, ఆరా, భేటీకి టీఆర్ఎస్ నేత

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రేవంత్ రెడ్డి ఆత్మీయ సభపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా వేశారని తెలుస్తోంది. రేవంత్‌తో పాటు టీడీపీ నుంచి మరికొందరు కీలక నేతలు పార్టీ మారనున్నారని భావిస్తున్నారు.

  Today TOP 10 Trending News టుడే టాప్ 10 న్యూస్ | Oneindia Telugu

  కీలక నేతలు గుడ్‌బై, టీడీపీ ఖాళీ!: మేమూ వస్తాం, వీరంతా రేవంత్ రెడ్డి వెంటే

   రేవంత్ ఇంటి వద్ద ఇంటెలిజెన్స్ అధికారులు

  రేవంత్ ఇంటి వద్ద ఇంటెలిజెన్స్ అధికారులు

  ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ఇంటెలిజెన్స్ అధికారులు జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటి పరిసరాల్లో భారీగా మోహరించారని తెలుస్తోంది. ఆయనను ఎవరెవరు కలుస్తున్నారు? ఆత్మీయ సమావేశానికి ఎవరెవరు హాజరవుతున్నారు అనే విషయాలను నిషితంగా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

   వారే కాదు, వీరూ ఆరా తీస్తున్నారు

  వారే కాదు, వీరూ ఆరా తీస్తున్నారు

  అంతేకాదు, ఇంటెలిజెన్స్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన కొందరు... రేవంత్ రెడ్డిని కలుస్తున్న వారు, వారి వ్యూహాలు ఏమిటనే దాని పైన కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏఏ పార్టీకి చెందిన వారు వచ్చారు, ఏఏ ప్రాంతాల నుంచి ఎక్కువ వచ్చారు అనే విషయాలపై కూడా ఆరా తీస్తున్నారు.

  రేవంత్ ఇంటికి పెద్ద ఎత్తున అభిమానులు

  రేవంత్ ఇంటికి పెద్ద ఎత్తున అభిమానులు

  రేవంత్ సోమవారం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తన నివాసంలో కార్యకర్తలు, ముఖ్య నేతలతో కలిసి ఆత్మీయ సమావేశాన్ని ప్రారంభించారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఈ సమావేశానికి రేవంత్ అభిమానులు వచ్చారు. వారిలో అత్యధికులు టీడీపీ వారు కాగా, మిగతా పార్టీల వారు కూడా వచ్చారు.

   రేవంత్ ఆత్మీయ సభకు దొమ్మాటి సాంబయ్య

  రేవంత్ ఆత్మీయ సభకు దొమ్మాటి సాంబయ్య

  కాగా, రేవంత్ రెడ్డి ఆత్మీయ సభకు అభిమానులు, అనుచరులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ ఆత్మీయ సమావేశానికి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేత దొమ్మాటి సాంబయ్య హాజరు కావడం గమనార్హం.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Revanth Reddy joining the Congress party is now official. The former TDP leader will join Congress on October 31 at 12 p.m. in the presence of party Vice-President Rahul Gandhi in New Delhi.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి