స్నానానికి వెళ్లి ఇంటర్ విద్యార్థుల జలసమాధి
కరీంనగర్: స్నానం చెయ్యడానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు జలసమాధి అయిన సంఘటన తెలంగాణలోని కరీంనగర్ లో జరిగింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు మానేరు జలాశయం దగ్గరకు చేరుకుని విలపిస్తున్నారు.
పోలీసుల కథనం మేరకు కరీంనగర్ లోని జ్యోతినగర్ కు చెందిన సాదుల సునంద్ (16), బీరెల్లి వరుణ్ (16) ఇంటర్ చదువుతున్నారు. బుధవారం ఉదయం వీరిద్దరు మరో ఐదు మంది స్నేహితులతో కలిసి పోలీసు శిక్షణా కేంద్రంలో హై జంప్, లాంగ్ జంప్ చేశారు.

తరువాత మానేరూ జలాశయంలో స్నానం చెయ్యడానికి వెళ్లారు. మొదట ఐదు మంది విద్యార్థులు జలాశయంలోకి దిగారు. అనంతరం వరుణ్, సునంద్ జలాశయంలోకి వెళ్లారు. ఐదు మంది ఒక వైపు వెళ్లారు.
అయితే వరుణ్, సునంద్ మరో వైపు వెళ్లారు. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో వరుణ్, సునంద్ ఇద్దరూ గల్లంతు అయ్యారు. సాటి స్నేహితులు వారిని రక్షించడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. స్థానికుల సహాయంతో ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications