పదవతరగతి హిందీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు: బండి సంజయ్ బెయిల్ రద్దుకు కోర్టులో వాదనలు

పదవ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసును మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న పదవ తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో ఏ1 నిందితుడుగా బండి సంజయ్ ను పేర్కొన్న విషయం తెలిసిందే.

బండి సంజయ్ పై 120b, 420, 447, 505(1), 4 (ఏ) తెలంగాణ రాష్ట్ర పరీక్షల నిర్వహణ చట్టం 46, 8, 66 (డీ ఐ టి) సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ ను మొదటి నిందితుడిగా పేర్కొన్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కరీంనగర్ జైలుకు ఆయనను తరలించారు.

 pp hearings on bandi sanjay bail cancellation

8 గంటల పాటు హోరాహోరీ వాదనల తర్వాత బండి సంజయ్ బెయిల్ పై బయటకు వచ్చారు. ఇప్పటికేబండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలన్న ప్రభుత్వ పిటిషన్ జిల్లా కోర్టు తిరస్కరించగా, జిల్లా కోర్టు సూచన మేరకే హన్మకొండ నాలుగవ ఎం ఎం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం బండి సంజయ్ బెయిల్ రద్దు కోరుతూ ప్రభుత్వం హనుమకొండ నాలుగవ ఎం ఎం కోర్టులో పిటిషన్ పై నేడు వాదనలు కొనసాగాయి.

బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం తరఫున పీపీ తమ వాదనలను వినిపించారు. బండి సంజయ్ పోలీసుల విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని స్పెషల్ పీపీ సత్యనారాయణ కోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులైన ఏ 6, ఏ 9 కు బెయిల్ పై వాదనలు ముగిసినట్లుగా పేర్కొన్నారు. అయితే వాదనలు విన్న కోర్టు నిర్ణయం రేపటికి వాయిదా వేసింది. మరి రేపటి వాదనలు విన్న తర్వాత కోర్టు బెయిల్ పిటిషన్ రద్దు పై ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+