Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ పార్టీలోకి ఉండవల్లి..!! ఇతర రాష్ట్రాల మాజీ ఎంపీలు -అధికారులు : కొత్త లెక్కలతో పక్కాగా..!!

జాతీయ పార్టీ ఏర్పాటు పైన క్లారిటీ ఇచ్చిన కేసీఆర్ ఆ దిశగా కసరత్తు వేగవంతం చేసారు. జాతీయ పార్టీ కేవలం అధికార మార్పు కోసం కాకుండా.. కొత్త లక్ష్యాలతో ఉండాలని భావిస్తున్న కేసీఆర్. ఆ దిశగా పలువురు ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జాతీయ కార్యవర్గం ఏర్పాటు పైన ఆయన దృష్టి సారించారు. పార్టీ ముఖ్య నేతలతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ తో వరుస సమావేశాలు నిర్వహించిన ఆయన..తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లితో భేటీ అయ్యారు. దేశంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మధ్య ఇద్దరి మధ్య చర్చ జరిగింది.

సీఎం కేసీఆర్ పార్టీ కోసం ఉండవల్లి

సీఎం కేసీఆర్ పార్టీ కోసం ఉండవల్లి

జాతీయ స్థాయిలో ఏం చేయాలనే ఆలోచనల పైన ఉండవల్లి తన తన అభిప్రాయాలను సీఎం కేసీఆర్ తో పంచుకున్నారు. తన అజెండాలోని పలు అంశాలను సీఎం కేసీఆర్ సమావేశంలో ఉండవల్లికి వివరించారు. ఉండవల్లి నుంచి అభిప్రాయాలను సేకరించారు. కొద్ది రోజుల క్రితమే ఉండవల్లి ..సీఎం కేసీఆర్ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. అప్పుడు తీసుకున్న నిర్ణయం మేరకు ఇప్పుడు ఉండవల్లి హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. జాతీయ పార్టీ ఏర్పాటులో తన వంతుగా సహకారం అందిస్తానని ఉండవల్లి చెప్పినట్లు సమాచారం. ఇక, కేసీఆర్ జాతీయ పార్టీలో ఇతర రాష్ట్రాల నేతలకు అవకాశం ఇవ్వాల్సి ఉంది. దీంతో.. ఉండవల్లి సైతం కేసీఆర్ పార్టీలో తన వంతు పాత్ర పోషిస్తారనే వాదన వినిపిస్తోంది.

కొత్త కార్యవర్గం ఏర్పాటుపై కసరత్తు

కొత్త కార్యవర్గం ఏర్పాటుపై కసరత్తు

అయితే, పార్టీలో చేరుతారా..లేక, బయట నుంచి మద్దతిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. కేసీఆర్ తన జాతీయ పార్టీ ఏర్పాటు తీర్మానం ఈ నెల 19న రాష్ట్ర కార్యవర్గంలో ప్రవేశ పెట్టి..ఆమోదించనున్నారు. జాతీయ పార్టీ కార్యవర్గంలో టీఆర్ఎస్ లో క్రియా శీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు ఎంపీలతో పాటుగా.. జాతీయ రాజకీయాల పైన పట్టు ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలకు స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో..కేవలం టీఆర్ఎస్ నేతలతో మాత్రమే కాకుండా... ఇతర రాష్ట్రాలకు చెందిన మాజీ ఎంపీలకు కేసీఆర్ తన కార్యవర్గం లో స్థానం కల్పించాలని డిసైడ్ అయ్యారు. జాతీయ పార్టీ కావటంతో ఇప్పటికే తనతో కలిసి అడుగులు వేయటానికి సిద్దమైన పార్టీ నేతలు సూచించే వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదే విధంగా రాజకీయ నేతలతో పాటుగా రైటర్డ్ సివిల్స్ అధికారులకు సైతం కేసీఆర్ తన పార్టీలో క్రియా శీలకం చేసేందుకు నిర్ణయించారు.

కొత్త లెక్కలతో పక్కాగా అడుగులు

కొత్త లెక్కలతో పక్కాగా అడుగులు


పలు రాష్ట్రాలకు చెందిన మాజీ ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు ఇప్పటికే కేసీఆర్ తో టచ్ లోకి వచ్చినట్లుగా పార్టీ లో చర్చ సాగుతోంది. పూర్తి స్థాయి కార్యవర్గం.. ఢిల్లీలో తన పార్టీ తరపున అధికార ప్రతినిధులు..తన జాతీయ పార్టీ జెండా- అజెండా పైన పూర్తి స్పష్టతతో ఈ నెల 19న పార్టీ కార్యవర్గ సమావేశంలో ప్రకటన చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రపతి ఎన్నిక లో ఎటువంటి పాత్ర పోషించాలనే దాని పైన కసరత్తు కొనసాగిస్తున్నారు. ఈ నెల 15న ఢిల్లీలో మమతా బెనర్జీ రాష్ట్రపతి ఎన్నిక పైన నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొనాలని సీఎం కేసీఆర్ కు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే, సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+