INTER: ఇంటర్ ఫలితాల ముహూర్తం ప్రకటించిన బోర్డు, ఈ సారి ప్రత్యేకంగా..!!

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అలర్ట్. ఫలితాల డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఇంటర్ బోర్డు అధికారులు ఈ సారి వీలైనంత త్వరగా ఫలితాలు ప్రకటించాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా పరీక్ష లు పూర్తయిన వెంటనే వాల్యుయేషన్ ప్రారంభించారు. నిర్ణీత సమయంలోనే పూర్తి చేసారు. కాగా, ఫలితాల తేదీల పైన భిన్న వాదనలు వచ్చాయి. వీటి పైన ఇంటర్ బోర్డు స్పష్టత ఇచ్చింది. ఇక.. ఇప్పుడు అధికారికంగా ఫలితాల వెల్లడి పైన స్పష్టత వచ్చింది. ఫలితాలు ప్రకటించే సమయం లోనే మార్కులు అధికారికంగా అందుబాటులో ఉంచనున్నారు.

ఇంటర్‌ పరీక్షా ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఒక వేళ రేపు సాధ్యం కాకుంటే ఒక రోజు ఆలస్యంగా ఆదివారం ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందు కోసం తుది కసరత్తు జరుగుతోంది. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఈ పరీక్షలు మార్చి 18తో ముగిశాయి. సమాధాన పత్రాల మూల్యాంకనం గత నెలాఖరు లోనే పూర్తి చేసారు. అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణులై కేవలం ఒక సబ్జెక్టులో ఒకటి రెండు మార్కులతో ఫెయిలైన విద్యార్థుల సమాధానపత్రాలను ఈసారి మళ్లీ మూల్యాంకనం చేశారు. ఈ ప్రక్రియ కూడా ఇటీవలే ముగిసింది. విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి అనుమతి తీసుకుని ఫలితాలను ఈనెల 12న విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

intermediate-results-chances-to-release-on-11th-or-12th-of-this-month-as-board-officials-latest-deci

సీఎం రేవంత్ తో చర్చల తరువాత అధికారిక ప్రకటన

కాగా, ఈసారి ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 9,97,075 మంది హాజరయ్యారు. వీరిలో 4,89,126 మంది ప్రథమ సంవత్సరం, 5,07,949 ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. ఇక.. ఈ సారి ఫలితాలు వెల్లడి సమయంలో.. అధికారికంగా ప్రభుత్వ వాట్సప్ ద్వారాను మార్కుల వివరాల ను అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. అదే విధంగా మార్కుల వివరాలను ఫలితాల వెబ్‌సైట్లు: tgbie.cgg.gov.in, tsbienew.cgg.gov.in, results.cgg.gov.in తో పాటుగా manabadi.com లోనూ అందుబాటులో ఉంచుతున్నారు. అదే విధంగా అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in ని సందర్శించాలని సూచిస్తున్నారు. 'TS Inter 1st Year/2nd Year Results 2026' లింక్‌పై క్లిక్ చేయాలి. మీ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయటం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ తో చర్చల తరువాత అధికారికంగా సమయం ప్రకటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+