International Women's Day: ఒకటి కాదు రెండు కాదు.. మహిళల కోసం ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్లు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతివలను ఆకట్టుకునేలా సరికొత్త ఆఫర్ లతో తెలంగాణ ఆర్టీసీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నజరానా ప్రకటించింది. ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పించాలని నిర్ణయించిన తెలంగాణ ఆర్టీసీ, వయసు పైబడిన మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ, మహిళల పట్ల తమకున్న గౌరవ భావాన్ని ప్రకటించింది. అంతేకాదు మహిళల కోసం ఈరోజు పలు ఆఫర్లను కూడా ప్రకటించింది ఆర్టీసీ.

Recommended Video

    TRS త‌ర‌ఫున 6 నుంచి మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు - Minister Satyavathi Rathod | Oneindia Telugu

    60 ఏళ్లకు పైబడిన మహిళలకు నేడు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన ఆర్టీసీ

    రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏళ్లకు పైబడిన మహిళలకు ఈ రోజు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ అవకాశం ఈ ఒక్కరోజు మాత్రమే అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్పెషల్ గా అందిస్తున్నామని ఆయన తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో మహిళా ప్రయాణికుల కోసం రద్దీ ఎక్కువగా ఉంటే ప్రత్యేకంగా ట్రిప్పులు నడుపుతామని సజ్జనార్ తెలిపారు.

    డ్వాక్రా మహిళలకు చేయూతనిచ్చేలా ఆర్టీసీ నిర్ణయం

    డ్వాక్రా మహిళలకు చేయూతనిచ్చేలా ఆర్టీసీ నిర్ణయం


    ఇక ఇదే సమయంలో ఇంకా అన్ని బస్టాప్ లలో మహిళా వ్యాపారులకు ఉన్న స్టాల్స్ కు సంబంధించి ఈ నెల 31వ తేదీ వరకు ఎటువంటి చార్జీలు తీసుకోమని సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ నెల 31వ తేదీ వరకు వారికి ఉచితంగా స్టాల్స్ ను కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రధాన బస్ స్టేషన్లలో మహిళా వ్యాపారులు డ్వాక్రా గ్రూపుల ద్వారా ఉత్పత్తుల సేల్స్ కోసం ఉచిత స్టాల్స్ ను, స్పేస్ ను అందించాలని ఆర్టీసీ నిర్ణయించినట్టు వెల్లడించారు.

    30 రోజులపాటు మహిళలకు బస్సు డైవింగ్ శిక్షణ

    30 రోజులపాటు మహిళలకు బస్సు డైవింగ్ శిక్షణ

    అలాగే ఆసక్తి ఉన్న మహిళలకు 30 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా 30 డ్రైవింగ్ శిక్షణ సంస్థల్లో బస్సు డ్రైవింగ్ పై ఉచిత శిక్షణ ఇప్పించనున్నారు. అయితే ఈ సౌకర్యం పొందాలనుకునే మహిళా అభ్యర్థులకు తప్పకుండా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్, రెండేళ్ల అనుభవం ఉండాలి. అంతేకాదు గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు ఆర్టీసీ బస్సులో రెండు సీట్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు ఇక గ్రేటర్ పరిధిలో డైలీ పాస్ అయినా ఏపీ 24 టిక్కెట్ పై మార్చి 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. వరంగల్లోనూ ఈ రాయితీని ఇవ్వాలని నిర్ణయించారు.

    మహిళల కోసం ఆర్టీసీ లక్కీ డ్రా..

    మహిళల కోసం ఆర్టీసీ లక్కీ డ్రా..

    మహిళలకు లక్కీ డ్రా సదుపాయాన్ని కూడా కల్పించిన ఆర్టీసి బస్సు స్టాండ్ లో ఏర్పాటుచేసిన డ్రాప్ బాక్స్ లలో టిక్కెట్ పై ఫోన్ నెంబర్ రాసి వేయాలి. లక్కీ డ్రా లో గెలుపొందిన వారికి నెల రోజుల పాటు డిపో నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో ఉచిత ప్రయాణం తో పాటు ప్రత్యేక బహుమతులు కూడా ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. ముఖ్యంగా మహిళల్లో కానీ ఆకర్షించేలా, ఆర్టీసీలో మహిళలకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తూ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం, ఇస్తున్న బంపర్ ఆఫర్ల పట్ల మహిళా లోకం సంతోషం వ్యక్తం చేస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+