Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్ సర్కార్.. బిగ్ మిషన్

Revanth Reddy: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు. నేడు తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించనున్నారు. నవ్సారీ జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకలకు హాజరు కానున్నారు.

మహిళా పోలీసులే భద్రత..

ఈ కార్యక్రమానికి పూర్తిగా మహిళా పోలీసులే భద్రతను కల్పించడం ప్రాధాన్యతను సంతరించరుకుంది. చరిత్రలో తొలిసారి ఓ దేశ ప్రధానికి పూర్తిగా మహిళా పోలీసులతో పహారా ఏర్పాటుచేయబోతోండటం చర్చనీయాంశమైంది. మహిళ ఫోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే ఈ వేడుకలు కొనసాగనున్నాయి.

International Women s day Telangana govt is set to launch the Indira Mahila Shakti Mission 2025

మహిళా సాధికారితకు ప్రాధాన్యత..

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేక నిర్ణయాలను తీసుకోనుంది. రాష్ట్రంలో మహిళా సాధికారితకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా మరిన్ని సంక్షేమ పథకాలను ప్రకటించబోతోంది.

ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025..

ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పేరుతో వీటిని ఆవిష్కరించనుంది రేవంత్ సర్కార్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా నేడు నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో- లక్ష మందికి పైగా మహిళల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ మిషన్‌ను ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

32 జిల్లాల నుంచి మహిళా సంఘాల సభ్యులు..

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొననున్నారు. మంత్రి సీతక్క ఈ సభకు అధ్యక్షత వహించనున్నారు. ఈ సభకు 32 జిల్లాల నుంచి మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు.

భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశిస్తూ..

ఈ ఏడాది మహిళా స్వయం సహాయక బృందాల విజయాలతో పాటు భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశిస్తూ ఇందిరా మహిళ శక్తి మిషన్- 2025ను రూపొందించింది రేవంత్ ప్రభుత్వం. ప్రతి జిల్లాల్లో మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు కాబోయే సోలార్ విద్యుత్ ప్లాంట్లను ముఖ్యమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.

64 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం..

మొత్తం 32 జిల్లాల్లో జిల్లాకు రెండు మెగావాట్ల చొప్పున మొత్తం 64 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభిస్తారు రేవంత్ రెడ్డి. మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. ఇందులో భాగంగా మొదటి విడతలో 150 ఆర్టీసీ అద్దె బస్సులకు పచ్చా జెండా ఊపి ప్రారంభించనున్నారు.

వడ్డీ లేని రుణాల చెక్కులు..

వడ్డీ లేని రుణాల చెక్కులను మహిళా సంఘాలకు రేవంత్ రెడ్డి అందజేస్తారు. ఈ ఏడాది కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన 400 మంది మహిళా సంఘాల సభ్యులకు 40 కోట్ల రూపాయల ప్రమాధ బీమా చెక్కులను పంపిణీ చేస్తారు.

31 జిల్లాల్లోనూ పెట్రోల్ బంకులు..

నారాయణపేట జిల్లాల్లో మహిళా సంఘాలు ప్రారంభించిన పెట్రోల్ బంక్ తరహాలోనే మిగిలిన 31 జిల్లాల్లోనూ పెట్రోల్ బంకులు ప్రారంభించేలా బీపీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్‌తో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఇందిరా శక్తి భవనాల నిర్మాణం, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ఇందిరా మహిళా శక్తి బజార్లను ప్రారంభిస్తామని ప్రభుత్వం తెలిపింది.

అమ్మ ఆదర్శ పాఠశాలల ఏర్పాటు..

అలాగే- ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు యూనిఫాం కుట్టడం, అమ్మ ఆదర్శ పాఠశాలల ఏర్పాటు, ప్రమాద బీమా, రుణ బీమా కల్పించడం, సంచార చేపల విక్రయ అవుట్‌లెట్ల ఏర్పాటు వంటి అంశాలను ఇందిరా మహిళా శక్తి మిషన్- 2025లో భాగంగా ప్రకటించనుంది ప్రభుత్వం.

14,000కు పైగా..

వీటిలో ఇప్పటికి కొన్ని అమలులో ఉన్నాయి. మిగిలిన వాటిని కలిపి ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 రూపొందించింది రేవంత్ ప్రభుత్వం. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 14,000కు పైగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకాల ప్రక్రియను కూడా ఇదే వేదిక ద్వారా ప్రకటించే అవకాశం ఉంది.

22,000 కోట్ల రూపాయల రుణాలు..

17 రకాల వ్యాపారాల్లో మహిళా సంఘాలను ప్రొత్సహిస్తూ 22,000 కోట్ల రూపాయల రుణాలు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సైతం ఈ సభ ద్వారా వెల్లడించనున్నారు. ఐటీ కారిడార్‌లో మూడెకరాల స్థలంలో తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు, సబ్సిడీలో ఇ-ఆటోలు ఇవ్వాలనే నిర్ణయాన్ని కూడా తీసుకోవచ్చు.

International Women s day Telangana govt is set to launch the Indira Mahila Shakti Mission 2025

ఒక్కో ఆటో ఖర్చు..

ఒక్కో ఆటో ఖర్చు 3.5 లక్షల రూపాయలు. ఇందులో లక్ష రూపాయల వరకు ప్రభుత్వం భరించే అవకాశం ఉంది. ఉచితంగా మహిళలకు ఆటోలను నడపడంలో శిక్షణ ఇవ్వడం, తదితర అంశాలను కూడా ఈ వేదికపై ప్రకటించే అవకాశం ఉంది.

యుద్ధ ప్రాతిపదిన..

పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభ ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదిన పూర్తయ్యాయి. అన్ని విభాగాల సమన్వయంతో బహిరంగ సభకు హాజరయ్యే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. సభకు హాజరు కావడానికి వచ్చే అతిధులు, మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.

ఎండదెబ్బ తగలకుండా..

వేసవిని దృష్టిలో పెట్టుకుని మంచినీటి సదుపాయాన్ని అందుబాటులో ఉంచారు. మహిళలకు ఎండదెబ్బ తగలకుండా షామియానాలు, కుర్చీలు వేశారు. దాదాపు లక్ష మంది మహిళలు సభకు వస్తారని అంచనా వేసిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది.

ముందు జాగ్రత్త చర్యలు..

మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బహిగరం సభ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, మహిళలకు అసౌకర్యం కలగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా

భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక దృషి పెట్టాలని సీతక్క సూచించారు. మహిళా శక్తిని చాటే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వమే ముందుండి అధికారికంగా సభను నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా సభను నిర్వహిస్తామని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+