కెటిఆర్‌కు అంతర్జాతీయ గుర్తింపు: శ్రీలంక అధ్యక్షుడితో కలిసి ప్రసంగం

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావుకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. ఓ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాలంటూ శ్రీలంక ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఆగస్టు 11, 12 తేదీల్లో కొలంబోలో నిర్వహించే హ్యూమన్‌ క్యాపిటల్‌ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా కేటీఆర్‌కు శ్రీలంక ఆహ్వానం పలికింది.

దేశ విధానాలు, శిక్షణా కార్యక్రమాలు, ఉద్యోగాలకు యువత సంసిద్ధం అంశాలపై శ్రీలంక ప్రధాని విక్రమ సింఘేతో పాటు కేటీఆర్‌ ఈ సమ్మిట్‌లో కీలక ఉపన్యాసం చేయనున్నారు.

Invitation to KTR from Sri Lanka government

శ్రీలంక ఆహ్వానంనిపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. శ్రీలంక ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శిక్షణ, నైపుణ్య కార్యక్రమాలను శ్రీలంకలో వివరిస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే తన ప్రసంగాలతో అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు, కేంద్రమంత్రుల నుంచి మంత్రి కెటిఆర్ ప్రశంసలందుకున్న విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
IT and Municipal Administration Minister KT Rama Rao will tour Sri Lanka in August. Already KTR had toured a number of countries as Minister, and Sri Lanka is the latest addition to his itinerary.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి