ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఐఆర్‌బీ లీగల్ నోటీసులు: రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా

హైదరాబాద్: బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఐఆర్‌బీ(IRB) సంస్థ లీగల్ నోటీసులు జారీ చేసింది. రూ. 1000 కోట్లకు పరువు నష్టం దావా వేస్తూ ఐఆర్‌బీ సంస్థ రఘునందన్ రావుకు సోమవారం లీగల్ నోటీసులు పంపింది. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్టును హెచ్ఎండీఏ సంస్థ ఐఆర్‌బీ సంస్థకు లీజుకు ఇచ్చింది.

అయితే ఈ టెండర్ కేటాయింపులో అక్రమాలు జరిగాయని.. ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. నిబంధనలను తుంగలో తొక్కి హెచ్ఎండీఏ.. ఐఆర్‌బీ సంస్థకు ఓఆర్ఆర్ టోల్ కాంట్రాక్టు లీజును 30 ఏళ్లకు కట్టబెట్టిందని రఘునందన్ రావు వెల్లడించారు. రఘునందన్ రావు ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐఆర్‌బీ ఆయనపై రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా వేస్తూ లీగల్ నోటీస్ పంపింది.

MLA Raghunandan Rao

హైదరాబాద్‌ ఓఆర్ఆర్ టోల్ కాంట్రాక్టు టెండర్ అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఓఆర్ఆర్ టోల్ కాంట్రాక్ట్ టెండర్ అంశంలో వేల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వేల కోట్ల విలువైన ఓఆర్ఆర్‌ను తక్కువకే ఐఆర్‌బీ సంస్థలకు ప్రభుత్వం అప్పగించిందంటూ విమర్శించారు.

ఐఆర్ బీ అనే సంస్థ బ్లాక్ లిస్టులో ఉందన్నారు. బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థకు ఏ విధంగా ఓఆర్ఆర్ టెండర్లు కట్టబెడతారు? ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. 30ఏళ్ల పాటు లీజ్ కు ఇవ్వడం సరైంది కాదు. ప్రస్తుతం వస్తున్న ఆదాయాన్ని అంచనా వేసి రూ.7,300 కోట్లకు మాత్రమే కాంట్రాక్ట్ ఇవ్వడం సరైంది కాదంటూ రఘునందన్ రావు అన్నారు.

ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు IRB సంస్థపై పదునైన ఆరోపణలు చేశారు. దీంతో IRB సంస్థ రఘునందన్ రావుకు రూ. 1000 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. అయితే దీనిపై రఘునందన్ రావు ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు, ఓఆర్ఆర్ లీజుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ రెడ్డికి హెచ్ఎండీఏ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+