కాచిగూడ నుంచి IRCTC మైసూరు, బేలూరు రైలు..!!
Kachiguda- Mysuru Tourist Special Train: మెమరీస్ ఆఫ్ మైసూర్ పేరుతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. బేలూరు, సోమనాథపురను కూడా ఇందులో చేర్చింది. మొత్తం అయిదు రాత్రులు/ ఆరు పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. ప్రతి బుధవారం సాయంత్రం 7:05 నిమిషాలకు కాచిగూడ నుండి ఈ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన కనిష్ట ఛార్జీ 11,370 రూపాయలు. గరిష్టంగా 32,710 రూపాయల వరకు ఉంది.
ఒకరి నుంచి ముగ్గురు ప్యాసింజర్లు ఉంటే..
కంఫర్ట్ (3ఏ) కేటగిరీ లో.. సింగిల్ షేరింగ్ ఛార్జీ ధర 32,710 రూపాయలు. డబుల్ షేరింగ్ కోసం 18,820 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ధర 16,050 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు అంటే 5 నుంచి 11 సంవత్సరాల లోపు వారికి రూ. 10,200, బెడ్ లేకుండా రూ. 7,970లు.

స్టాండర్డ్ (స్లీపర్) కేటగిరీలో.. సింగిల్ షేరింగ్ ఛార్జీ ధర 30,690 రూపాయలు. డబుల్ షేరింగ్ కోసం 16,800 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ధర 14,030 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు 8,180 రూపాయలు, బెడ్ లేకుండా 5,950 రూపాయలు.
నలుగురి నుంచి ఆరుమంది ప్యాసింజర్లు ఉంటే..
కంఫర్ట్ (3ఏ) కేటగిరీ లో.. సింగిల్ షేరింగ్ ఉండదు. డబుల్ షేరింగ్ కోసం 15,230 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ధర 13,390 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు రూ. 12,070, బెడ్ లేకుండా రూ. 9,840లు.
స్టాండర్డ్ (స్లీపర్) కేటగిరీలో.. సింగిల్ షేరింగ్ ఉండదు. డబుల్ షేరింగ్ కోసం 13,210 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ధర 11,370 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు రూ. 10,050, బెడ్ లేకుండా రూ. 7,820 రూపాయలను వసూలు చేస్తారు.












Click it and Unblock the Notifications