నేరుగా శ్రీవారి దర్శనం, శ్రీకాళహస్తి - ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ..!!
శ్రీవారి భక్తులకు అరుదైన అవకాశం. ముందస్తు బుకింగ్ లేకుండానే తిరుమలలో శ్రీవారి దర్శనం తో పాటుగా సమీపంలోని ప్రముఖ ఆలయాల సందర్శనకు వీలుగా కొత్త టూర్ ప్యాకేజీని బక్తుల కోసం ప్రకటించారు. హైదరాబాద్ నుంచి తిరుమల కు ఈ ప్యాకేజీ మూడు రోజుల పాటు కొనసాగేలా ప్లాన్ చేసారు. కాళహస్తి, తిరుచానూరు అమ్మవారిని దర్శించుకునేలా టూర్ ప్యాకేజీ ఖరారు చేసారు. ఈ ప్యాకేజీ వివరాలను అధికారులు వెల్లడించారు.
శ్రీవారి దర్శనం
తిరుమల శ్రీవారి భక్తుల కోసం ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది. "తిరుపతి బై వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్" రైలు ప్యాకేజీ ద్వారా మొత్తం మూడు రాత్రులు, రెండు పగళ్లు ఈ యాత్ర కొనసాగేలా ప్లాన్ చేసారు. ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండానే భక్తులు శ్రీవారి దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గురు, శుక్రవారాలు మినహా ప్రతి రోజూ ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. టూర్ లో తొలి రోజు ప్రత్యేక రైలు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్ 12797) రాత్రి 8:05 గంటలకు తిరుపతి బయల్దేరుతుంది. రాత్రంతా ప్రయాణించి తెల్లవారుజామున తిరుపతి చేరుకుంటారు.

మూడు రోజుల టూర్
రెండో రోజులో భాగంగా ఉదయం 07:05 గంటలకు తిరుపతి చేరుకున్నాక హోటల్‌కి తీసుకెళ్తా రు. చెకిన్, ఫ్రెషప్ అయిన తర్వాత తిరుచానూరు పద్మావతి ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం లోగా అమ్మవారిని దర్శించుకున్నాక శ్రీకాళహస్తికి వెళ్తారు. శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకుని తిరిగి తిరుపతికి వచ్చి హోటల్‌లో రాత్రి బస ఉంటుంది. మూడో రోజు తెల్లవారు జామునే హోటల్ నుంచి బయల్దేరి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలి. ఉచిత దర్శనం క్యూలైన్ ద్వారా వెళ్లి స్వామి వారిని దర్శించుకున్న తర్వాత తిరిగి తిరుపతిలోని హోటల్‌కు చేరుకోవాలి. సాయంత్రం హోటల్ చెకౌట్ చేసి తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.
29న ప్రారంభం
గంటలకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ (12798) ద్వారా తిరిగి హైదరాబాద్ బయల్దేరుతారు. ఇక, రాత్రంతా ప్రయాణం చేసి ఉదయం 06:20 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో తిరుపతి టూర్ ముగుస్తుంది. కంఫర్ట్ క్లాస్ (3AC) సింగిల్ షేరింగ్ - రూ. 13,810, డబుల్ షేరిం గ్ - రూ. 10,720, ట్రిపుల్ షేరింగ్ - రూ. 8,940 గా ఖరారు చేసారు. స్లీపర్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ - రూ. 12,030, డబుల్ షేరింగ్ - రూ. 8,940, ట్రిపుల్ షేరింగ్ - రూ. 7,170 గా ప్యాకేజీ ధరలు నిర్దారించారు. ఈ టూర్ మార్చి 29వ తేదీన ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications