IRCTC శ్రావణం స్పెషల్ సౌత్ టూర్- అరుణాచలం, మధురై సహా, ప్యాకేజీ ఇలా..!!
IRCTC శ్రావణ మాసం వేళ దివ్య దక్షిణ యాత్ర జ్యోతిర్లింగం దర్శనం యాత్ర ను ప్రకటించింది. ఈ యాత్ర ఎనిమిది రోజుల పాటు సాగనుంది. తమిళనాడు - కేరళ రాష్ట్రాల్లోని ప్రముఖల ఆలయా ల ను దర్శించుకునేలా రూట్ ఖరారు చేసారు. ఈ యాత్రకు సంబంధించి సీట్ల వివరాలు.. ప్యాకేజీ ధరలను ప్రకటించారు. దర్శించుకునే ప్రాంతాలు .. ఆలయాల వివరాలను ఐఆర్సీటీసీ వెల్లడించింది.
యాత్రా స్థలాలు
ఐఆర్సీటీసీ ప్రకటించిన ఈ టూర్ ప్యాకేజీలో తిరువన్నామలై, రామేశ్వరం, మధురై, కన్యాకు మారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూర్‌లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈ నెల 19వ తేదీన యాత్ర ప్రారంభం కానుంది. బోర్డింగ్ స్టేషన్లుగా సికింద్రాబాద్, జనగామ, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మ, మధిరి, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట ఉంటాయని వెల్లడించారు. ఎకానమీ (స్లీపర్) : పెద్దలకు రూ.14,100/-, 5 నుంచి 11ఏళ్ల వయస్సులోపు బాల బాలికలకు రూ.13,200 కాగా, స్టాండర్డ్ (3 ఏసీ ) : పెద్దలకు రూ.22, 300/-, 5 నుంచి 11ఏళ్ల వయస్సులోపు బాల బాలికలకు రూ.21,200గా ప్రకటించారు.

ప్రముఖ క్షేత్రాలు
ఈ యాత్రలో తిరువన్నామలై : అరుణాచలం ఆలయం, రామేశ్వరం : రామనాథస్వామి ఆలయం, మధురై : మీనాక్షి అమ్మాన్ ఆలయం, కన్యాకుమారి : రాక్ మెమోరియల్, కుమారి అమ్మాన్ ఆల యం, త్రివేండ్రం : శ్రీ పద్మనాభస్వామి ఆలయం, తిరుచ్చి : శ్రీరంగనాథ స్వామి ఆలయం, తంజా వూర్ : బృహదీశ్వరాలయం ఉన్నాయి. తొలి రోజున రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరి జనగామ, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మ, మధిరి, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా తిరువన్నామలై చేరుతుంది. రెండు రోజున తిరువన్నామలైలో అరుణాచలం ఆలయాన్ని దర్శించు కుంటారు. మూడో రోజు రామేశ్వరం చేరుకుని అక్కడి హోటల్లో బస చేస్తారు. దర్శనం తర్వాత అక్కడే బస చేస్తారు.
టూర్ షెడ్యూల్
నాలుగో రోజున రామేశ్వరం నుంచి మధురై ప్రయాణం ఉంటుంది. సాయంత్రం కామాక్షి అమ్మ వారిని దర్శించుకుంటారు. ఐదో రోజున ఉదయం 8గంటలకు కన్యాకుమారి చేరుకుని విశ్రాంతి తీసుకున్న తర్వాత రాక్ మెమోరియల్ సందర్శన, సూర్యాస్తమయం వీక్షిస్తారు. రాత్రంతా అక్కడే బస చేస్తారు. ఆరో రోజున ఉదయం కన్యాకుమారి నుంచి త్రివేండ్రం ప్రయాణించి పద్మనాభస్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం కోవాలం బీచ్ సందర్శిస్తారు. ఏడో రోజున తిరుచిరాపల్లి చేరుకుని శ్రీరంగం ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం తంజావూర్ వెళ్లి బృహదీశ్వరాలయం దర్శనం ఉంటుంది. రాత్రి ప్రయాణించి తెల్లవారుజామున తిరుపతి చేరుకుంటారు. చివరి రోజున తెల్లవారుజామున 5గంటలకు తిరుపతి, రాత్రి 9 గంటల వరకు సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. టికెట్ల వివరాల కోసం సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం లోని కౌంటర్లను సంప్రదించాలని సూచించారు.












Click it and Unblock the Notifications