హైదరాబాద్-వారణాసి ఐఆర్‌సీటీసీ టూర్: ఆరు రోజులు, ప్యాకేజీ ధర ఎంతో తెలుసా?
హైదరాబాద్: వేసవి కాలం కావడంతో చాలా మంది ప్రజలు పర్యటనలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఐఆర్‌సీటీసీ వారి కోసం పలు ప్రత్యక ప్యాకేజీలను అందిస్తోంది. ఇండియన్ రైల్వే కేటింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) ప్రయాణికులకు కోసం మంచి ప్యాకేజీ తీసుకొచ్చింది. గంగా రామాయణ్ యాత్ర పేరుతో హైదరాబాద్ నుంచి కాశీకి ఈ ప్యాకేజీ అందిస్తోంది.
ఐదు రాత్రులు, ఆరు రోజులుగా ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది. ప్రస్తుతం ఈ పర్యటన జూన్ 7వ తేదీన అందుబాటులో ఉంది. ఆసక్తి కలిగినవారు ఈ ప్యాకేజీ వివరాలను తెలుసుకుని తమ పర్యటనను పూర్తి చేసుకోవచ్చు. ఆరు రోజుల టూర్ ప్యాకేజీ ఇలా ఉండనుంది..

తొలి రోజు:
ఐఆర్‌సీటీసీ గంగా రామాయణ్ యాత్ర జూన్ 7వ తేదీన ప్రారంభమవుతుంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానం ఉదయం 9.30 గంటలకు బయలుదేరి వారణాసి విమానాశ్రయానికి ఉదయం 11.25 గంటలకు చేరుకుంటారు. అనంతరం హోటల్‌లో చెకిన్ అవ్వాల్సి ఉంటుంది. భోజనం తర్వాత కాశీ దేవాలయం, గంగా ఘాట్,సందర్శన ఉంటుంది. రాత్రి వారణాసిలోనే బస ఉంటుంది.
రెండో రోజు:
రెండో రోజు సారనాథ్ సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం తిరిగి వారణాసికి చేరుకుంటారు. అనంతరం బిర్లా ఆలయం దర్శించుకుంటారు. ఆ తర్వాత ఘాట్‌లను సందర్శించడం/ షాపింగ్ కోసం సమయం కేటాయిస్తారు. భోజనం తర్వాత రాత్రి వారణాసిలో బస ఉంటుంది.
మూడో రోజు:
ఇక యాత్రలో మూడో రోజు వారణాసి హోటల్ నుంచి చెకవుట్ అయి ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యకు బయలుదేరాల్సి ఉంటుంది. మధ్యలో ఆనంద్ భవన్, అలోపి దేవి ఆలయం, త్రివేణి సంగమం సందర్శన ఉంటుంది. సాయంత్రం అయోధ్యకు బయలుదేరి రాత్రికల్లా చేరుకుంటారు. భోజనం తర్వాత రాత్రి అయోధ్యలో బస ఉంటుంది.
నాలుగో రోజు:
నాలుగలో రోజు ఉదయం అయోధ్య ఆలయాన్ని సందర్శన ఉంటుంది. మధ్యాహ్నానికి హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి లక్నోకి బయలుదేరాలి. అక్కడ హోటల్‌లో దిగాలి. లక్నోలో రాత్రి బస ఉంటుంది.
ఐదో రోజు:
ఇక టూర్‌లో భాగంగా ఐదవ రోజు నైమిశరణ్య దర్శనం ఉంటుంది. అక్కడ దర్శనం ముగించుకున్నాక సాయంత్రం తిరిగి లక్నో రావాల్సి ఉంటుంది. లక్నోలో రాత్రి బస ఉంటుంది.

ఆరవ రోజు:
ఈ టూర్‌లో చివరి రోజు ఉదయం రోజు బారా ఇమాంబరా, అంబేద్కర్ మెమోరియల్ పార్క్‌ని సందర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు లక్నో విమానాశ్రయంలో విమానం ఉంటుంది. అక్కడ నుంచి రాత్రి 8:00 వరకు హైదరాబాద్ వస్తారు. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ఇక ఈ టూర్ ప్యాకేజీ ధర వివరాల్లోకి వస్తే.. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ. 36,850 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ.29,900, ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే రూ.28,200. 5 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు కూడా టికెట్ ధరలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ వంటివి కవర్ అవుతాయి.
ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications