సికింద్రాబాద్ నుంచి జ్యోతిర్లింగాల దర్శనం- త్రయంబకేశ్వరం కవర్: హాల్ట్ స్టేషన్లు
Secunderabad- Pancha Jyotirlinga special train: ఇంకో రెండురోజుల్లో శ్రావణమాసం ఆరంభం కాబోతోంది. ఈ మాసంలో ఊరూ- వాడా ఆలయాలను తలపిస్తుంటాయి. నెల రోజుల పాటు భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. ఈ నెలలో ఎన్నో మంచి రోజులు , విశిష్ట పండుగలు రానున్నాయి.
ఈ మాసానికి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ నుంచి పంచ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్ర దర్శనం పేరిట ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. మహారాష్ట్రలో వెలిసిన ప్రఖ్యాత జ్యోతిర్లింగాలను ఈ ప్యాకేజీలో చేర్చింది.

భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. ఎనిమిది రాత్రులు/ తొమ్మిది పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. ఆగస్టు 16వ తేదీన సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్- 460, 3ఏసీ- 206, 2ఏసీ- 52.
సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్‌కు కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందెడ్, పూర్ణ స్టేషన్లలల్లో హాల్ట్ సౌకర్యం ఉంటుంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు. ఉజ్జయిని- మహాకాళేశ్వరుడు, ఓంకారేశ్వరుడి జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు.
నాసిక్‌లో త్రయంబకేశ్వరుడి ఆలయం, పుణేలో భీమశంకర్, ఔరంగాబాద్‌లో ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనం ఈ ప్యాకేజీలో చేర్చారు. ఈ టూర్ ప్యాకేజీ ద్వారా పంచ జ్యోతిర్లింగాలను దర్శించుకోదలిచిన వాళ్లు ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 14,700 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్.
ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 13,700 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీ (3ఏసీ)లో పెద్దలకు 22,900, పిల్లలకు 21,700 రూపాయలు, కంఫర్ట్ కేటగిరీ (2ఏసీ)లో పెద్దలకు 29,900, పిల్లలకు 28,400 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications