మిషన్ కాకతీయ: 'పూడికతీత మంచిదే' (ఫోటోలు)
హైదరాబాద్: మిషన్ కాకతీయ వెబ్‌సైట్, ఫేస్‌బుక్, ట్వీటర్, యూట్యూబ్ ఛానల్‌లను ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మట్లాడుతు మిషన్ కాకతీయ వెబ్ సైట్ ను పక్కాగా రూపొందించామని అన్నారు.
మిషన్ కాకతీయ కు సంబంధిచిన అన్ని విషయాలను ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని అన్నారు. ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రజల నుండి సలహాలు సూచనలు కూడా తీసుకుంటామని తెలిపారు. దేశ విదేశాలలోని తెలంగాణ ప్రజల కోసం తోమ్మిది జిల్లాలోని చెరువుల సమాచారన్ని వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చునని తెలిపారు. విరాళాలను ఆన్ లైన్ ద్వారా స్వీకరించాడానికి ఈ వెబ్‌సైట్‌ను అందరూ ఉపయోగించుకొవాలని అన్నారు.

మిషన్ కాకతీయ: 'పూడికతీత మంచిదే'
కార్బన్ క్రెడిట్స్ ద్వారా అదాయం సమకూరుతుందనే విషయాన్ని మిచిగాన్ విద్యార్ధులు తమ దృష్టికు తీసుకొని వచ్చారని అన్నారు. వారి ప్రతిపాదనపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. చెరువుల పునరుద్దరణలో దేశం అంత ఒక్క వైపు... తెలంగాణ ఒక్క వైపు అన్నట్టు ఉంది అని తెలిపారు.

మిషన్ కాకతీయ: 'పూడికతీత మంచిదే'
దేశం మొత్తం మీద ఎన్ని చెరువులు పునరుద్ధరించారో తెలంగాణలో వాటి కంటే ఎక్కువగా చెరువుల పునరుద్ధరన జరిగిందని అన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మద్దతుతోనే సాధ్యమయిందని తెలిపారు. మిషన్ కాకతీయ హెల్ప్ లైన్ ఫోన్‌కు పది జిల్లాల నుండి ఇప్పటికే 1726 కాల్స్ వచ్చినట్టు తెలిపారు.

మిషన్ కాకతీయ: 'పూడికతీత మంచిదే'
ఇందులో 325 కాల్స్ ఆక్రమణలకు సంబంధించినవేనని అన్నారు. 182 రెవెన్యూ శాఖకు సంభందించినవిగా తెలిపారు. పూడికతీత, రవాణ ఖర్చులకు సంబంధించిన ఫిర్యాదులు 324 వచ్చినట్టు తెలిపారు. పనుల నాణ్యయతపై 194 ఫిర్యాదు హెల్ప్ లైన్ కు వచ్చినట్టు వివరించారు. ఇతర కెటగిరీలో 883 వచ్చినట్టు తెలిపారు. వీటన్నింటిని పరిష్కరిస్తున్నామని చెప్పారు.

మిషన్ కాకతీయ: 'పూడికతీత మంచిదే'
జలసౌధలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్ కే జోషి, ఇ ఎన్ సీ మురళిదర్ రావు, సీఇలు రమేష్, రామకృష్ణ రావు, ఓఎస్డీ శ్రీదర్ రావు దేశ్ పాండేలు పాల్గోన్నారు.
చెరువుని దత్తత తీసుకోవాలపుకుంటున్న వాళ్ళు ఈ వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చెసుకొని దత్తత తీసుకొవాలని పిలుపునిచ్చారు. బిల్లుల చెల్లింపులో పారదర్శకత కోసం ఈ వెబ్ సైట్‌ను బిల్ మానిటరింగ్ సిస్టంకు అనుసంధానం చేసి ఆన్ లైన్ ద్వారా బిల్లుల చెల్లింపులను చేయడానికి ఏర్పాటు చేశామని తెలిపారు
మిషన్ కాకతీయకు దేశ విదేశాల నుండి ప్రశంసలు వస్తున్నాయని అన్నారు. మిచిగాన్ యునివర్శిటి విద్యార్ధుల బృందం కూడా మిషన్ కాకతీయ పని తీరు పై పరిశోదన చేసిందన్నారు. చెరువుల పునరుద్దరణతో పర్యావరణాన్ని, విద్యుత్ కోసం ఉపయోగించే బోగ్గును, ఎరువుల వాడకం పై వారు పరిశోధన చేశారు.












Click it and Unblock the Notifications